ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maths Puzzle: ప్రభుత్వోద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే మీరు కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నట్టే లెక్క..!

ABN, First Publish Date - 2023-10-06T13:50:27+05:30

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి ఒక చిన్న ప్రశ్న ఛాలెంజ్ విసురుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే లెక్కలలో ఫిట్ గా ఉన్నట్టేనట.

చాలావరకు కాంపిటేటివ్ పరీక్షలలో సెట్టుకు సెట్టు మార్కులు లభించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది మ్యాథ్స్ మాత్రమే. లెక్కల మీద మంచి పట్టు ఉంటే పరీక్షలలో టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అందుకే చాలామంది మ్యాథ్స్ సబ్జెక్ట్ పదును పెట్టుకుంటూ ఉంటారు. గణితం సబ్జెక్ట్ లో మంచి స్కోర్ చేసేవాళ్ళను సహజంగానే ఇంటెలిజంట్స్ అని కూడా పిలుస్తారు. కానీ మ్యాథ్స్ అర్థం కాకపోతే మాత్రం దీనంత కష్టం మరొకటి ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి ఒక చిన్న ప్రశ్న ఛాలెంజ్ విసురుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే పోటీ పరీక్షల ప్రిపరేషన్ లో ట్రాక్ లో ఉన్నట్టే అని అంటున్నారు. ఇంతకీ ఈ ప్రశ్న ఏంటి? అందులో లాజిక్ ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

పోటీ పరీక్షలలో(Competitive exams) చాలావరకు లెక్కల సమస్యలు(Math's problems) కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. లెక్కల మీద పట్టు ఉన్నవాళ్లు అయితే క్షణాల నుండి నిముషాలలో వీటిని పరిష్కరిస్తారు. కానీ లెక్కలలో వీక్ గా ఉన్నవారు గంటల కొద్ది సమయం తీసుకుంటారు. వీటిలో శాతాలు, కొలతలు, కాలం, దూరం వంటి లెక్కలు వస్తుంటాయి. ఇప్పుడు శాతాలకు(Percentage) సంబంధించిన ఒక ప్రశ్న నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'ఒక పాఠశాలలో 60శాతం మంది అబ్బాయిలు ఉన్నారు. పాఠశాలలోని బాలికల సంఖ్య 972 అయితే, అబ్భాయిల సంఖ్య కనుక్కోండి' అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. A) 1258 B) 1458 C) 1324 D) 1624 ఈ నాలుగులో సరైన సమాధానాన్ని ఎంపికచేయాలి.

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? రోడ్డు దాటుతూ వ్యాన్ వస్తోందని పక్కకు తప్పుకున్న కుక్కను కావాలనే ఢీకొట్టి చంపేసిన డ్రైవర్..



ఈ ప్రశ్నను mathwithmanish అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ ప్రశ్న చూసిన పలువురు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నవారు తమలో ఉన్న గణిత సామర్థ్యాన్ని బయటకు తీస్తున్నారు. కామెంట్ సెక్షన్ ను తమ సమాధానాలతో ముంచెత్తుతున్నారు. ప్రశ్నను బాగా అర్థం చేసుకున్న కొందరు ఈ ప్రశ్న పరిష్కారాన్ని వివరిస్తున్నారు. 'అమ్మాయిలు= 972. 972÷4=242. పాఠశాలలో 60% అబ్బాయిలు 242×60=1458. సమాధానం 1458' అని కామెంట్ చేసారు. '972÷(100-60=)40×60=1458' అని ఇంకొకరు కామెంట్ చేశారు. "972/2+972=486+972=1458" అని మరొకరు కామెంట్ చేసారు. '972 40% డివిజన్ కాబట్టి 972/0.4=2430. 2430 100% డివిజన్ కాబట్టి 2430-972=1458' అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా ఒకే లెక్కను వివిధ రకాలుగా చేసి అందరూ ఒకే సమాధానాన్ని రాబట్టారు.

Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!


Updated Date - 2023-10-06T13:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising