ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఆమెకు 16 ఏళ్లు.. అతడికి 65 ఏళ్లు.. చట్ట ప్రకారమే పెళ్లి.. కానీ పెళ్లయిన మర్నాడే చేసిన నిర్వాకంతో..!

ABN, First Publish Date - 2023-05-01T17:42:11+05:30

అతని వయసు 65 ఏళ్లు. పైగా ప్రజాప్రతినిధి. ఒక నగరానికి మేయర్. అంటే నగర ప్రథమ పౌరుడు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ అతడు ఏం చేశాడో తెలిస్తే మాత్రం

Viral News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలకు పెళ్లిళ్లు చేసేటప్పుడు ఈడూ జోడూ చూసి వివాహం చేయాలంటారు పెద్దలు. ఒకరు లావు.. ఇంకొరు సన్నగా.. లేదంటే ఒకరు పొడవు.. ఇంకొరు పొట్టిగా ఉంటే చూడ్డానికి బాగుండరు. అందుకే తగిన జోడి వెతికి మ్యారేజ్ చేయాలంటారు. ఇకపోతే వయసులో ఉన్నప్పుడు పెళ్లిళ్లు చేస్తే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. పెద్దలు కూడా తమ అనుభవంతో చెబుతుంటారు. ఇదంతా ఎందుకంటారా? ఈ స్టోరీ చదివితే ముక్కున వేలేసుకుంటారు? ఈ వయసులో ఇదేం పాడుబుద్ధి అనుకుంటారు.

అతని వయసు 65 ఏళ్లు. పైగా ప్రజాప్రతినిధి. ఒక నగరానికి మేయర్. అంటే నగర ప్రథమ పౌరుడు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ అతడు ఏం చేశాడో తెలిస్తే మాత్రం వామ్మో ఈ వయసులో ఇదేం పని అనుకుంటారు.

దక్షిణ బ్రెజిల్‌లోని (Brazil) అరౌకారియా నగర మేయర్‌ హిస్సామ్‌ హుసేన్‌ దేహైని (Mayor Hissam Hussein Dehaini) 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సీన్‌తో నగర్ వాసులు షాక్ అయ్యారు. అంతేకాదు.. పెళ్లి కాగానే మేయర్ చేసిన నిర్వాకం చూసి డిప్యూటీ మేయర్ మరింత విభ్రాంతినొందాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోగానే ఆమె తల్లికి.. అనగా మేయర్ అత్తగారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించేశాడు. ఏకంగా కొత్త అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటకశాఖ కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చి అమ్మాయి మనసును మరింత దోచుకున్నాడు.

బ్రెజిల్ చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిక అమ్మాయిలను వారి తల్లిదండ్రుల సమ్మతితో పెళ్లి చేసుకోవచ్చు. దీంతో ఆ అమ్మాయికి అలా 16 ఏళ్లు దాటాయో లేవో మరుసటి రోజే ఆమెను మనువాడేశాడు మేయర్. ఇద్దరూ.. ఒకరికొకరు రింగులు మార్చేసుకున్నారు. ఇక అమ్మాయి తల్లికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించేశాడు అల్లుడు. అమ్మాయి తల్లి అంతకుముందే విద్యాశాఖలో ఉద్యోగం చేస్తోంది. కానీ అందులో ఆమెకు తక్కువ జీతం.. హోదా కూడా తక్కువ కావడంతో అల్లుడు నామోషిగా ఫీలయ్యాడో.. ఏమో తెలియదు గానీ.. మేయర్ తన పలుకబడి ఉపయోగించి అత్తగారికి ఉద్యోగంలో పదోన్నతి కల్పించేశాడు. తాజాగా ఈ వ్యవహారం బయటకు రావడంతో పెద్ద దుమారం చెలరేగుతోంది. మేయర్‌పై పెద్ద ఎత్తున అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు రావడంతో విచారణ సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయి. మేయర్ చేసిన ఈ వ్యవహారాన్ని డిప్యూటీ మేయర్ బయటపెట్టడంతో కొత్త పెళ్లికొడుకు కష్టాలు మొదలయ్యాయి.

ఇది కూడా చదవండి: Marriage Dates: హమ్మయ్య.. బ్యాచులర్స్‌కు మంచి రోజులొచ్చాయోచ్.. మే, జూన్ నెలల్లో పెళ్లికి మంచి ముహూర్తాలివే..!

Updated Date - 2023-05-01T17:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising