ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Medicine: మీరూ ఇలానే మందులు వేసుకుంటున్నారా? జబ్బులు తగ్గడం మాట అటుంచితే ఇన్ని ప్రమాదాలున్నాయని తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-17T16:17:08+05:30

ఇప్పట్లో ఏదో ఒక సమస్యతో రోజూ ట్యాబ్లెట్స్ మింగుతున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడైపోయిన ఆరోగ్యం చక్కబడటానికి చాలామంది మందులు(Medicine) వాడతారు. 30ఏళ్ళు కూడా నిండకనే రోజూ ఏదో ఒక సమస్యతో ట్యాబ్లెట్ మింగుతున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. షుగర్(Sugar), బీపీ(BP), థైరాయిడ్(thyroid), విటమిన్స్ లోపం(vitamins deficiency) ఇలా చెబితే మందులవాడకం నెలవారీ ఇంటి సరుకుల లిస్ట్ కు ఏమీ తీసిపోదు. అయితే మందులు ఎలా వేసుకున్నా మనకు బాగైపోతుందేని అనుకుంటే మాత్రం పొరపాటే.. చాలామంది భోజనం చేయగానే(after meals) మంచినీటితో మందులు వేసుకుంటారు. ఉద్యోగాలు చేసేవారు, బయట ప్రయాణాలు చేసే సమయంలోనూ, మరికొన్ని సందర్భాలలో నీటికి బదులుగా పాలు(Milk), జ్యూస్లు(Juices), ఇతర పానీయాలతో మందులు వేసుకుంటారు. అయితే ఇది చాలా తప్పని, మందులు అలా వేసుకుంటే జబ్బులు తగ్గడం మాట అటుంచితే.. బోలెడు అనారోగ్యాలు కొత్తగా పుడతాయని అంటున్నారు. ఇంతకీ మందులు వేసుకోవడానికి సరైన మార్గం ఏది? మందులు చక్కగా పనిచేయాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..

చాలామందికి రాత్రి పడుకునేముందు పాలతో ట్యాబ్లెట్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. మరికొందరు ఆహారం తినలేక పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకుంటారు. పాలు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి అయినా అవి యాంటీబయాటిక్స్(antibiotics) ప్రభావాన్ని తగ్గిస్తాయి. పాలలో కాల్షియం(calcium), మెగ్నీషియం(magnesium), మినరల్స్(minerals), ప్రొటీన్లు(proteins) ఉంటాయి. ఇవి మందులతో కలిపినప్పుడు మెడిసిన్ పై ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వైద్యులు పాలతో మెడిసిన్ తీసుకోకూడదని చెబుతారు.

మనం తీసుకునే మందులు ఏవైనా అనారోగ్యాన్ని తగ్గించి మనల్ని శక్తివంతుల్ని చెయ్యాలి. కానీ బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు చాలామంది శీతల పానీయాలతో(cool drinks) ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఈ కూల్ డ్రింక్స్ తయారీకి రసాయనాలు వాడటం వల్ల వాటితో మందులు కలిస్తే అవి పనిచేయవు. పైపెచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీస్తాయి.

Husband: రాత్రి 3 గంటలు.. రోడ్డుపక్కన కారును ఆపమన్న భార్య.. మూత్ర విసర్జనకు వెళ్లి తిరిగొచ్చే లోపే మర్చిపోయి వెళ్లిపోయిన భర్త..!


ఆకుకూరలు ఎంతో గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే భోజనం తరువాత మందులు వేసుకోవాల్సిన వారు విటమిన్ కె(Vitamin-K) అధికంగా ఉండే ఆకుకూరలు తినకూడదట. వీటిలో పాలకూర(spinach), బ్రోకలీ(Broccoli), మొలకలు(Sprouts), ఆవఆకు(Mustard greens), క్యాబేజీ (cabbage)మొదలైనవి ఉన్నాయి.

మధ్యపానం(alcohol) అలవాటు ఉన్నవారు బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ ను ఒకోసారి మద్యంతో కలిపి వేసుకుంటారు. కొన్ని మందులు ఇలానే వేసుకుంటారు. ఇలా తీసుకునేవారి కాలేయం చాలా తొందరగా దెబ్బతింటుంది.

ట్యాబ్లెట్స్ ను ఎప్పుడూ గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి. భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక పదినిమిషాలు ఆగి వేసుకోవాలి. ట్యాబ్లెట్ వేసుకున్న తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే తీసుకున్న మందులు బాగా పనిచేస్తాయి.

Viral News: మీ తెలివికి ఓ చిన్న పరీక్ష.. ఈ ట్రేలో ఎన్ని గుడ్లు ఉన్నాయో లెక్క పెట్టగలరా..? సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు..!


Updated Date - 2023-04-17T17:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising