Gurdeep Kaur Chawla: ఎవరీ మహిళ..? ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారంటే చాలు.. పక్కన ఈమె ఉండాల్సిందే..!
ABN, First Publish Date - 2023-07-12T13:48:11+05:30
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ ఆయన పక్కన ఓ మహిళ ఉండడం మీరు చూసే ఉంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ ఆయన పక్కన ఓ మహిళ ఉండడం మీరు చూసే ఉంటారు. ప్రధాని విదేశీ నాయకులతో భేటీ అయ్యే ప్రతిసారీ ఆయనతో పాటు ఆమెను మీరు గమనించే ఉండొచ్చు. ఆమె పేరు గుర్దీప్ కౌర్ చావ్లా (Gurdeep Kaur Chawla). ఆమె అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ఒక సక్సెస్‌పుల్ వ్యవస్థాపకురాలు. గుర్దీప్ కౌర్ మంచి అనువాదకురాలు కూడా. ప్రధానమంత్రి ప్రసంగాన్ని అనువదించి, అనుభవజ్ఞులైన దేశాధినేతలతో పాటు అగ్ర నాయకులందరికీ వివరించడం ఆమె విధి.
గురుదీప్ కౌర్ చావ్లా భారతీయ భాషా సేవ ఎల్ఎల్‌పీ (LLP) డైరెక్టర్. అనువాదం, వివరణ రంగంలో ముప్ఫై ఏళ్ల కంటే కూడా ఎక్కువ అనుభవం ఆమె సొంతం. దౌత్య, కార్పొరేట్ ప్రపంచానికి అనువాదం, వివరణ సర్వీసులను అందిస్తారామె. గుర్దీప్ కౌర్ చావ్లా ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో బీఏ (BA (Hons)), ఏంఏ (MA) డిగ్రీ పట్టాలు పొందారు. అలాగే రాజకీయ శాస్త్రం (Political Science) లో మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ (Ph.D) చేశారు. ఆమె భారత పార్లమెంటు, జ్యుడీషియల్ కౌన్సిల్ ఆఫ్ కాలిఫోర్నియా, యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ద్వారా శిక్షణ పొందారు. ప్రధాని మోదీ ప్రసంగాలను హిందీ నుంచి ఇంగ్లీషులోకి అనువదించే బాధ్యత గుర్దీప్ కౌర్ చావ్లాది. అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు జో బైడెన్‌లతో ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు గుర్దీప్ కౌర్ చావ్లా ఆయన వెంటే ఉన్నారు.
Snake: పాముకు జన్మనిచ్చిన మహిళ.. వైరల్‌గా మారిన వీడియోలు.. ఇది నిజమేనా అని డాక్టర్లను కలిసి అడిగితే..!
గుర్దీప్ కౌర్ చావ్లా 1990లో 21 సంవత్సరాల వయస్సులో భారత పార్లమెంటులో భాషా అనువాదకురాలిగా తన వృత్తిని ప్రారంభించారు. ఇక ఆమె యూఎస్ (US) కు వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. 2010లో గుర్దీప్ కౌర్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) బృందం తన మొదటి భారత పర్యటనలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవాల్సిందిగా ఆహ్వానించింది. 2015లో రిపబ్లిక్ డే పరేడ్‌లో బరాక్ ఒబామా ప్రసంగాన్ని ఆమె అన్వయించారు. ప్రస్తుతం ఆమె ప్రధానమంత్రి మోదీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు, అంతకుముందు మాజీ అధ్యక్షులు ఒబామా, డొనాల్డ్ ట్రంప్ అనువాదకురాలిగా ఉన్నారు.
Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?
Updated Date - 2023-07-12T13:54:10+05:30 IST