ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Men Vs Women: నిజమైన ప్రేమ ఉండేది ఆడవారిలోనా..? మగవారిలోనా..? విడిపోయినప్పుడు ఎవరు ఎక్కువగా బాధపడతారో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-02-28T10:16:28+05:30

ప్రేమ ఎవరికి ఎక్కువ? బంధం నుండి విడిపోతే ఎవరెక్కువ బాధపడతారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లవ్, ఇష్క్, కాదల్ ఇలా పేర్లు ఎన్నైనా సమాజంలో ప్రేమ పాత్ర చాలా పెద్దది. అది అక్షయపాత్రలా ఎమోషన్స్ ను, ఫీలింగ్స్ ను మనుషుల్లో పుట్టిస్తుంది. సినిమాల్లో చాలావరకు ప్రేమ కథలు గమనిస్తే మహిళలో లేక పురుషులో ఎవరో ఒకరు ఎక్కువగా ప్రేమించినట్టు చూపిస్తారు. అయితే ఓవరాల్ గా ప్రేమ మగవారిలో ఎక్కువ ఉంటుందా లేక ఆడవారిలో ఎక్కువ ఉంటుందా అనేది నిర్ణయించడం కష్టమే.. కానీ కొందరు పరిశోధకులు దీనికి సమాధానం కనుగొన్నారు. వారి ప్రయత్నంలో చాలా షాకింగ్ నిజాలు తెలిశాయి. ఇంతకూ ప్రేమ ఎవరికి ఎక్కువ? బంధం నుండి విడిపోతే ఎవరెక్కువ బాధపడతారు తెలుసుకుంటే..

నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారంటే..

ప్రేమించడం చాలా గొప్ప విషయం. అయితే తాము ఎదుటివారిని నిజంగా ప్రేమిస్తున్నామా అనే విషయంలోకి వెళితే.. మీరు గనుగ ఎదుటి వ్యక్తిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ వ్యక్తి పట్ల మీకు ప్రేమ ఉందని అర్థం. ఆ వ్యక్తితో గడిపే సమయం మీకు చాలా విలువైనదిగా మరింత కంఫర్ట్ గా అనిపిస్తుంటే ఆ వ్యక్తితో సాంగత్యం కోరుకుంటున్నారని అర్థం. ప్రపంచంలో ఎక్కువ మంది మహిళల్లో ఈ ప్రవర్తన మొదటి వరుసలో ఉంది. మగవారిలో ఈ లక్షణం తక్కువేనట.

మగవారు ప్రేమిస్తున్నట్టు కనిపించరు ఎందుకంటే..

మగవారు సహజంగా ప్రేమిస్తున్న మొదటి రోజుల్లో తప్ప ఆ తరువాత వారు ప్రేమిస్తున్నట్టే కనిపించరు. దీంతో వారికి ప్రేమ తగ్గిపోయింది అని కొందరు అంటుంటారు. కానీ మగవారు కూడా మహిళల్లా ప్రేమిస్తారు, వారు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయలేరు. ఈ కారణంగా మగవారి మనసు బండ అనే నింద కూడా వేసేస్తారు.

Read also: ఈ టైమ్‌లో పొలంలోంచి పొగలేంటని కూలీలకు డౌట్.. వెళ్లి చూస్తే కనిపించిన సీన్‌తో షాక్.. ఓ వ్యక్తి కట్టెలుపేర్చి కాల్చుతున్నదేంటో తెలిసి..


ఎవరు ఎక్కువ బాధపడతారంటే..

బ్రేకప్ అనేది ఈ కాలంలో కామన్ అయిపోయింది. ఇలా బ్రేకప్ జరిగినప్పుడు స్త్రీ, పురుషులలో ఎవరెక్కువ బాధపడతారు అనే విషయం గమనిస్తే మహిళలు బాధపడినట్టే మగవారు కూడా బాధపడతారు. అయితే పైన చెప్పుకున్నట్టు భావోద్వేగాలను మగవారు అణిచివేసుకుంటారు. ఈ కారణంగా వారేం ఫీల్ కావడం లేదని అనుకుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు తమ ఎమోషన్స్ ను తమ స్నేహితురాళ్ళతో పంచుకుని ఉపశమనం పొందుతారు. కానీ అబ్బాయిలు అలా ఓపెన్ కాలేరు. అమ్మాయి మోసం చేసింది అనే మాటను ఫ్రెండ్స్ ముందు చెప్పుకోవడానికి వారు కంఫర్ట్ గా ఫీలవ్వలేరు. అందుకే మగవారు బాధపడే విషయం బయటకు తెలియదు. ఆడవారు కన్నీరు పెట్టినట్టు మగవారు పెట్టకపోవడమే దీనికి పెద్ద ఉదాహరణ.

ఎవరు ప్రేమలో వేగంగా పడతారంటే..

మహిళలు పురుషుల్లో ఎవరు తొందరగా ప్రేమలో పడతారంటే పురుషులే అని నొక్కి చెబుతున్నాయి సర్వేలు. పురుషులు మొదటిచూపులోనే ప్రేమించడం అనే విషయాన్ని చాలా తొందరగా అంగీకరిస్తారు. కానీ అమ్మాయిలు అలా కాదు. వారు అంత తొందరగా అబ్బాయిలను అంగీకరించలేరు, భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు చేసుకుని నిర్ణయించుకున్న తరువాత కానీ అమ్మాయిలు ప్రేమకు ఓకే చెప్పడం లేదట.

తొందరగా ఎవరు బయటపడతారంటే..

స్త్రీ పురుషులలో ఎవరు తొందరగా బయటపడతారంటే పురుషులే.. అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి కేవలం కొన్ని వారాలు మాత్రమే సమయం తీసుకుంటారు. కానీ అమ్మాయిలు నెలలు, ఏళ్ళు అయినా నిబ్బరంగా వెయిట్ చేస్తారు. ఈ కారణంగా అమ్మాయిలు ఆచి తూచి అడుగులు వేస్తారని రూఢీ అయింది.

ఎవరు తొందరగా మూవ్ అవుతారంటే..

బ్రేకప్ అయ్యాక మహిళలు తమ భాగస్వాముల విషయంలో జరిగిన సంఘటనలను మరిచిపోయి వేరే లైఫ్ లో పడిపోతారు. కానీ మగవారు మాత్రం ఆ బాధ నుండి బయటపడటానికి చాలా సమయం తీసుకుంటారు. తాము ప్రేమించిన అమ్మాయి తాలూకు జ్ఞాపకాలను వారు అంత సులువుగా మరచిపోరనేది పరిశోధనలు రుజువు చేస్తున్న విషయం. ఆడవారిలో ఈ తాలూకు బాధ ఉన్నా మరొక బంధం ముడిపడితే, భార్యగా, తల్లిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలతో గతాన్ని మరచిపోగలుగుతారు.

మొత్తం మీద ప్రేమ విషయంలో, ప్రేమించడంలో, ప్రపోజ్ చేయడంలో, బ్రేకప్ తరువాత బాధపడే విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే.. ఆయా విషయాల్లో ఎవరి మార్గాలు వారికి వేరు వేరుగా ఉంటున్నాయి అంతే..

Updated Date - 2023-02-28T10:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!