కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Metro Train: పోలీస్ కానిస్టేబుల్‌ ఒకే ఒక్క మాట అన్నందుకు.. ఈ ఇద్దరు యువతులు చేసిన రచ్చ మామూలుగా లేదుగా..!

ABN, First Publish Date - 2023-09-11T11:39:41+05:30

ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ యువతిని కేవలం ఒకే ఒక మాట అన్నందుకు ఆమె అక్కడికక్కేడే గొడవకు దిగింది. పోలీసాఫీసర్ ను విమర్శిస్తూ ఆమె చేసిన రచ్చ చూస్తే..

Metro Train: పోలీస్ కానిస్టేబుల్‌ ఒకే ఒక్క మాట అన్నందుకు.. ఈ ఇద్దరు యువతులు చేసిన రచ్చ మామూలుగా లేదుగా..!

పోలీసులు శాంతి పరిరక్షణలో భాగంగా సమాజంలో అల్లర్లు, గొడవలు జరగకుండా ప్రజల జీవనాన్ని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ విధులు నిర్వర్తిస్తారు. వారు సందర్భాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడే మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. కానీ అందులో చాలా నిజం ఉంటుంది. మెట్రో స్టేషన్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ యువతిని కేవలం ఒకే ఒక మాట అన్నందుకు ఆమె అక్కడికక్కేడే గొడవకు దిగింది. పోలీసాఫీసర్ ను విమర్శిస్తూ ఆమె చేసిన రచ్చ ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువతి తీరు పట్ల ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇన్నాళ్లు ఢిల్లీ మెట్రో(Delhi metro) రైళ్ల కేంద్రంగా బోలెడు వీజియోలు సోషల్ మీడియాలోకి చొచ్చుకువచ్చాయి. కానీ ఇప్పుడు మెట్రో స్టేషన్(Delhi metro station) కేంద్రంగా జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఇద్దరు యువతులు, వారి ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్, మరొక వ్యక్తి ఉన్నారు. వారిలో పోలీస్ కానిస్టేబుల్ సదరు యవతిని మెట్రో స్టేషన్ నుండి వెళ్ళిపొమ్మని చెప్పాడు. దీంతో ఆ యువతి, ఆమెతో పాటు ఉన్న మరొక యువతి ఇద్దరూ పోలీస్ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగారు. నిజానికి ఆ అమ్మాయి అంతకు ముందు ఏదో వెధవ పని చేసినట్టు పోలీస్ కానిస్టేబుల్ మాటల ద్వారా అర్థమవుతోంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటనేది స్పష్టంగా తెలియదు. ఏ కారణం చేతనో పోలీస్ కానిస్టేబుల్ ఆ యువతులను ఇక్కడినుండి వెళ్ళిపోండి అని చెప్పగానే ఆ యువతి రైజ్ అయ్యింది. ఆమె ఆపకుండా ఒకటే రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఆ పోలిస్ కానిస్టేబుల్ 'మేము ఆడోళ్లం అని ఈమె అందరికీ వినిపించేలా చెబుతోంది' అంటూ పంచ్ వేశాడు. దీంతో ఆ యువతి అహం దెబ్బతినింది. 'అతన్ని మర్యాదాగా మాట్లాడమని చెప్పు' అని తన పక్కనున్న యువతికి చెప్పింది. ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Viral: సోషల్ మీడియాను భయపెడుతున్న ఫోటో.. షాపు బయట కాపలా కాస్తున్న సెక్యురిటీ గార్డుకు తల మిస్సింగ్.. అసలు రహస్యమేమిటంటే....



ఈ వీడియోను Ghar Ke Kalesh అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ గొడవ వెనుక కారణాలను ఊహించి చెబుతున్నారు. 'ఆ యువతి ప్లాట్ ఫామ్ మీద నిలబడుకుని వేగంగా రైలు వెళుతున్న సమయంలో రీల్స్ చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. అందుకే ఆ పోలీస్ కానిస్టేబుల్ వెళ్లిపొమ్మని చెప్పి ఉంటాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆమె రీల్స్ చేస్తూ ఏదైనా ప్రమాదానికి గురైతే అప్పుడు ప్రభుత్వం నుండి సాధారణ ప్రజల వరకు అందరూ పోలీస్ లనే తిడతారు. వారి కోణంలో కూడా ఆలోచించాలి. ఊరికే నోరు పారేసుకోకూడదు' అని మరొకరు ఆలోచనాత్మకంగా కామెంట్ పెట్టారు. 'ఆ యువతికి పోలీసుల పట్ల ఏ మాత్రం గౌరవం లేదని ఆమె మాటతీరులోనే అర్థం అవుతోంది' అని మరొకరు కామెంట్ పెట్టారు.

IRCTC Alert: రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ ముఖ్య గమనిక.. యాప్‌ ద్వారా టికెట్లను బుక్ చేసే వాళ్లకు..!


Updated Date - 2023-09-11T11:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising