ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Milk before Bed: రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటుందా..? లాభాలే కాదు.. ఈ నష్టాల గురించి కూడా తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2023-08-24T09:48:12+05:30

రాత్రి మంచి నిద్ర పట్టడానికి చాలామంది పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగుతుంటారు. అయితే పాల వల్ల కేవలం లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి

పాలు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలనుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పాలను తాగుతారు. కొందరికి రాత్రి సమయంలో పాలు తాగే అలవాటు ఉంటుంది. రాత్రి పూట భోజనం తీసుకోలేకపోయిన వారు కూడా పడుకునే ముందు గ్లాసుడు పాలు తాగితే కడుపు నిండిపోతుంది. మరీ ముఖ్యంగా రాత్రి మంచి నిద్ర పట్టడానికి చాలామంది పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగుతుంటారు. అయితే పాల వల్ల కేవలం లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి. దీనివల్ల ఊహించని సమస్యలు ఎదుర్కొనేవారు కూడా ఉన్నారు. కానీ పాల వల్లే ఇలా జరుగుతుందనే విషయం వారికి అర్థం కాదు. రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుంటే..

అధికశాతం మంది రాత్రి పడుకునేముందు పాలు తాగడానికి కారణం మంచి నిద్రకోసం(DRINKING MILK AT NIGHT). అయితే కొందరు రాత్రి పాలు తాగితే మంచి నిద్ర పట్టకపోగా వ్యతిరేక ప్రభావాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే పాలలో సహజ చక్కెరలు ఉంటాయి. లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నవారు పొరపాటున పాలను రాత్రి సమయంలో తాగితే ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇవి నిద్రను దారణంగా చెడగొడతాయి.

Ranbir Kapoor Health Issue: రణ్‌బీర్‌ కపూర్‌కు చిన్నప్పటి నుంచీ ఓ వింత సమస్య.. దానివల్లే తిన్నా.. మాట్లాడినా..!



నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల కడుపులో యాసిడ్(acid) ఏర్పడే అవకాశం ఉంటుంది. పాలలో కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కడుపులో ఆమ్లాలు పెరగడానికి కారణం అవుతాయి. ఈ ఆమ్లాల కారణంగా గుండెల్లో మంట కూడా కలుగుతుంది. దీనివల్ల సున్నితమైన జీర్ణక్రియ ఉన్న వ్యక్తులలో సమస్య ఏర్పడుతుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

పాలలో కేలరీలు సమృద్దిగా ఉంటాయి. నిద్రకు ముందు ఎక్కువ మొత్తం పాలు తీసుకుంటే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఎప్పుడో ఒకరోజు అయితే పరవాలేదు. కానీ ప్రతిరోజు ఇలా ఎక్కువ కేలరీలు నిద్రకు ముందు శరీరంలో చేరడం వల్ల బరువు పెరిగే ప్రక్రియ వేగంగా ఉంటుంది(weight gain with night drinking milk).

Singer Weight Loss: ఈ ఒక్క డ్రింక్‌ను మానేశాడట.. దెబ్బకు 25 కేజీల బరువు తగ్గిన ప్రముఖ సింగర్..!


రాత్రిసమయంలో పాలు తాగడం వల్ల కొందరిలో అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. చర్మం మీద దద్దుర్లు, దురద వంటి సమస్యలే కాకుండా శ్వాస సంబంధ సమస్యలు కూడా ఏర్పడుతాయి. కొన్నిసార్లు శరీరంలోని అనేక వ్యవస్థలకు ప్రమాదం కలిగించే అనాఫిలాక్సిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. పాలు తాగడంలో ముందే అలెర్ఝీ ఉన్నవారు పొరపాటున కూడా రాత్రి సమయంలో పాలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొంతమందికి పాలు తీసుకున్న తరువాత శ్లేష్మం ఏర్పడుతుంది. ఇది ముక్కు రంధ్రాలను మూసేయడం, ముక్కు కారడం, గొంతులో అడ్డుపడటం వంటి సమస్యలకు దారి తీస్తుంది. రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల ఈ సమస్యలతో శ్వాసకు ఇబ్బంది కలుగుతుంది. కలత నిద్రకు కారణమవుతుంది.

Health Tips: చెప్పులు లేకుండా నడవడం మంచిదా..? వేసుకుని నడిస్తే మంచిదా..? దేని వల్ల ఎక్కువ లాభమంటే..!


Updated Date - 2023-08-24T10:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising