ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Man Fakes Death: 'చావు' తెలివితేటలంటే ఇవే కాబోలు.. అందరినీ నమ్మించేశాడు.. కానీ ఒక చిన్న పొరపాటు అతణ్ని పట్టించింది..!

ABN, First Publish Date - 2023-08-27T13:57:41+05:30

ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh) లో ఓ యువకుడు చావు తెలివితేటలు ప్రదర్శించాడు. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా ఇంట్లోంచి పారిపోయిన అతగాడు.. తాను చిరుత పులి దాడిలో చనిపోయినట్లు అందరినీ నమ్మించాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh) లో ఓ యువకుడు చావు తెలివితేటలు ప్రదర్శించాడు. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా ఇంట్లోంచి పారిపోయిన అతగాడు.. తాను చిరుత పులి దాడిలో చనిపోయినట్లు అందరినీ నమ్మించాడు. దాని కోసం సినిమాటిక్‌గా పెద్ద డ్రామానే ఆడాడు. కానీ, అతడు చేసిన చిన్న పొరపాటుతో పట్టుబడ్డాడు. అసలేం జరిగిందంటే... యూపీలోని బిజ్నోర్ జిల్లా బెగంపూర్ షాదీకి చెందిన లలిత్ కుమార్ (25) కు ఇటీవలే వివాహమైంది. అంతకుముందు నుంచే ఇంట్లోవారితో మనోడికి సఖ్యత ఉండేది కాదు. పెళ్లైన తర్వాత నుంచి ఆ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో అతడు ఇంట్లోంచి ఎస్కేప్ అయ్యేందుకు ఒక ప్లాన్ వేశాడు.

ఈ నెల 17వ తేదీన తన గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే అటవీ ప్రాంతంలో అక్కడక్కడ తన బైక్, చెప్పులు, బట్టలు, మొబైల్ పారేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తన స్నేహితులుండే చంఢీగడ్ (Chandigarh) వెళ్లిపోయాడు. ఇక ఆ రోజు రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికారు. ఈ క్రమంలో తర్వాతి రోజు అతడి వస్తువులు అటవీ ప్రాంతంలో దొరికాయి. ఆ అటవీ ప్రాంతం చిరుతలు తిరిగే చోటు కావడంతో పాటు అంతకుముందు కొన్ని ఘటనలు కూడా జరిగాయి. లలిత్ తాలూకు వస్తువులు కూడా అదే అటవీ ప్రాంతంలోనే దొరకడంతో అందరూ అతడు చిరుత దాడిలో చనిపోయి ఉంటాడని నమ్మేశారు.

ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కూడా రెండు రోజుల పాటు అడవినంతంటినీ జల్లెడపట్టారు. కానీ, ఎక్కడ మనోడి ఆచూకీ దొరకలేదు. అయితే, లలిత్ వదిలి వెళ్లిన మొబైల్‌లో ఒక సీమ్ కార్డు మిస్‌కావడం పోలీసులకు అనుమానం కలిగించింది. అప్పటి నుంచి ఆ సీమ్ కార్డు యాక్టివేషన్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లలిత్ వారం రోజుల తర్వాత ఆ సీమ్ కార్డును తన స్నేహితుల ఫోన్‌లో పెట్టి వినియోగించాడు. అంతే.. పోలీసులకు అతడి లోకేషన్ దొరికిపోయింది. ఆ లోకేషన్ సాయంతో 25వ తేదీన అతడు ఉంటున్న చంఢీగడ్‌లోని ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అక్కడి నుంచి లలిత్‌ను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Viral Video: ఇంట్లో గోడకు ఉన్న అందమైన ఫొటోఫ్రేమ్ వెనుక.. గుండెలు అదిరే భయంకర దృశ్యం..!


Updated Date - 2023-08-27T13:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising