ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగింది తెలిస్తే.. ఇకపై మీరు ఆ తప్పు చేయరు..!

ABN, First Publish Date - 2023-02-26T12:21:05+05:30

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ (Mobile Phone) వాడకం పెరిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ (Mobile Phone) వాడకం పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక పోతున్నారు. గంటల పాటు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అరచేతిలో మొబైల్ లేకుంటే చాలా మంది అదేదో కోల్పోయినట్లే ఫీలవుతుంటారు కూడా. ఇలా అతిగా ఫోన్ వాడే అలవాటే ఇప్పుడు చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. పలు దుష్ర్పభావాలకు కేంద్రంగా మారుతుంది. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోయే బ్రిటన్ మోడల్ (Britain Model) విషయంలో మరోసారి ఇది నిరూపితమైంది. అతిగా మొబైల్ ఫోన్ వాడటం అనేది ఆమెను ఏకంగా వీల్‌చైర్‌కు (Wheelchair ) కొన్ని నెలల పాటు పరిమితం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన 29 ఏళ్ల ఫెనెల్లా ఫాక్స్ (Fenella Fox) అనే మోడల్ అతిగా ఫోన్ వినియోగించడం వల్ల వర్టిగో (Vertigo) అనే రుగ్మత బారినపడింది. తాను సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ 14 గంటల పాటు నిరంతరంగా ఫోన్ వాడానని ఆమె ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఐప్యాడ్, ఐఫోన్‌లలో (iPhone) గంటలతరబడి గడపడం తనకు భారీ నష్టాన్ని కలిగించిందని ఆమె తెలిపింది. వర్టిగో వ్యాధితో మంచాన పడేలా చేసిందని చెప్పింది. ఆ తర్వాత కొన్ని నెలలు వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చిందట. ఆమె పోర్చుగల్‌లో ఉన్నప్పుడు మొదట తలనొప్పి, మైకం వంటి లక్షణాలు మొదలయ్యాయి. అవి కాస్తా 2021 నవంబర్ నాటికి మరింత తీవ్రంగా పరిణమించాయి.

ఇది కూడా చదవండి: 70 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. 6నెలల వరకు స్టే చేసే ఫేసిలిటీ.. కానీ, మనోళ్లకు మాత్రం..

ఆ సమయంలో ఆమె సరిగా నడవలేకపోయారట. ఆ తర్వాత కొన్ని రోజులకే కింద నుంచి లేచి నిలబడటం కూడా కష్టంగా మారిపోయింది. అయితే, ఆమె ఈ అనర్థాలకు కారణం తన ఫోన్ అనే విషయం ఫాక్స్‌కు అప్పుడు తెలియలేదట. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆమె కంగుతింది. ఇదంతా మొబైల్ ఫోన్ అతిగా వాడటం వల్ల ఎదురైన అనారోగ్య సమస్యలు అని తెలిసి విస్తుపోయింది. ఒకనొక సమయంలో ఇంట్లో అటుఇటు తిరగడం కూడా సాధ్యపడలేదట. ఇంకా చెప్పాలంటే లేచి తన కాళ్లతాను నిలబడలేయింది. దాంతో ఆరు నెలల పాటు వీల్ చైర్ కావాల్సి వచ్చిందని ఫాక్స్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగు పడింది.

ఇది కూడా చదవండి: వామ్మో.. వీడసలు స్టూడెంటేనా..? వీధి రౌడీ కంటే దారుణంగా ఉన్నాడుగా..!

Updated Date - 2023-02-26T12:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising