ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Money Earning Tips: జీరో పెట్టుబడి.. నెలకు రూ.లక్షకు పైగానే లాభం.. ఇదేం వింత వ్యాపారం అని డౌటా..? అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-10-19T13:06:20+05:30

వ్యాపారానికి పెట్టుబడి ఉండాలనే కారణంతో చాలామంది వెనకడుగు వేస్తారు. అసలు ఒక్కరూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రతినెలా లక్షరూపాయలు సంపాదించే వ్యాపారం ఉందని మీకు తెలుసా?

ప్రపంచంలో డబ్బు సంపాదన అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడిన అంశం. బ్రతకడానికి డబ్బు ప్రధాన వస్తువు అయిన కారణంగా ప్రతి ఒక్కరూ దాన్ని సంపాదించడానికి ఆసక్తి చూపిస్తారు. కొందరు ఉద్యోగాలు చేస్తారు, మరికొందరు వ్యాపారం చేస్తూ సొంతంగా సంపాదించుకుంటారు. కానీ వ్యాపారానికి పెట్టుబడి ఉండాలనే కారణంతో చాలామంది వెనకడుగు వేస్తారు. అసలు ఒక్కరూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రతినెలా లక్షరూపాయలు సంపాదించే వ్యాపారం ఉందని మీకు తెలుసా? ఓ ఐదు సెంట్ల బంజరు భూమి ఉన్నా, ఇంటి పైన ఖాళీ స్థలమున్నా ఒకే ఒక్క పని చేయడం వల్ల నెలకు లక్షరూపాయలకు పైనే సంపాదించవచ్చు. ఈ వింత బిజినస్ ఏంటో వివరంగా తెలుసుకుంటే..

టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు(TSP) దేశంలో ప్రతి ప్రాంతంలో తమ సేవలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో మొబైల్ టవర్ ఇన్స్టాలేషన్ సేవలను(Mobile tower instalation service) వారు అందిస్తున్నారు. ఇంటి పైకప్పు ప్రాంతం లేదా ఖాళీ స్థలం ఉంటే మొబైల్ టవర్ పెట్టుకోవడానికి వారికి భూమిని అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL), టాటా కమ్యూనికేషన్స్, GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ టవర్స్, అమెరికన్ టవర్ కో ఇండియా లిమిటెడ్, HFCL కనెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొదలైన కంపెనీలకు సెల్ టవర్ ఇన్స్టాల్ చేయడానికి ఆయా కంపెనీలను సంప్రదించవచ్చు. సెల్ టవర్ కు అనుమతి ఇవ్వాలని అనుకుంటే దానికి తగిన ఆస్తి సమాచారాన్ని టెలికాం సంస్థలకు అందించవచ్చు. దానిని తనిఖీ చేసిన తరువాత వారు రెడియో ప్రీక్వెన్వి ని భరించేలాగా ఆ ప్రాంతం ఉంటే సదరు కంపెనీలు అవగాహన ఒప్పందాలు చేసుకుని సెల్ టవర్ లు నిర్మిస్తాయి.

Health Facts: రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటుంటారా..? మధుమేహం తప్పక వస్తుంది అనడానికి 5 కారణాలు..!



మొబైల్ టవర్ ఇన్స్టాలేషన్ ఖర్చు ఏమీ ఉండదు. మొత్తం టెలికామ్ సంస్థలే భరిస్తాయి. గ్రామాలు, సెమీ-రూరల్, అర్భన్ వంటి తేడాను బట్టి సెల్ టవర్ ఇన్స్టాలేషన్ తర్వాత ప్రతి నెలా 10వేల నుండి లక్షరూపాయల వరకు చెల్లిస్తారు. ఇకపోతే సెల్ టవర్ కు అనుమతి ఇవ్వాలనుకున్న ప్రాంతానికి దగ్గర్లో స్కూళ్లు, ఆసుపత్రులు వంటివి ఉండకూడదు. వీటికి కనీసం 100మీటర్ల దూరంలో టవర్ కు అనుమతి ఇచ్చే స్థలం ఉండాలి. ఇవన్నీ సరిపోతే ఆ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించడానికి ఒప్పుకుంటారు.

Heart Attacks: జిమ్ లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ లు.. డాక్టర్లు చెబుతున్న 10 షాకింగ్ కారణాల లిస్ట్ ఇదీ..!


Updated Date - 2023-10-19T13:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising