Money Tree: డబ్బులు చెట్లకు కాస్తున్నాయి.. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..
ABN, First Publish Date - 2023-10-21T16:29:40+05:30
చిన్న పిల్లలు డబ్బుల కోసం మారాం చేసినపుడు చాలా మంది పెద్దలు చెప్పే మాట.. డబ్బులేం చెట్లకు కాయడం లేదు అని. కష్టపడి సంపాదిస్తే తప్ప చెట్టు నుంచి పండు తీసినంత సులభంగా డబ్బు రాదు అని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందికి షాక్ కలిగించింది.
చిన్న పిల్లలు డబ్బుల (Money) కోసం మారాం చేసినపుడు చాలా మంది పెద్దలు చెప్పే మాట.. డబ్బులేం చెట్లకు కాయడం లేదు అని. కష్టపడి సంపాదిస్తే తప్ప చెట్టు నుంచి పండు తీసినంత సులభంగా డబ్బు రాదు అని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చాలా మందికి షాక్ కలిగించింది. చెట్లకు డబ్బు కాస్తుందని చూపించే ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Money falling from tree). అయితే చివరకు అది ఫ్రాంక్ వీడియో (Prank Video) అని తెలిసి చాలా మంది నవ్వుకుంటున్నారు.
nkzonekaran అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న చెట్టును కాలితో తన్నాడు. వెంటనే చెట్టు పై నుంచి కరెన్సీ కాగితాల కింద పడ్డాయి. వాటిని ఏరుకున్న వ్యక్తి మళ్లీ చెట్టును తన్నాడు. అప్పుడు కూడా డబ్బులు కింద పడ్డాయి. వాటిని కూడా ఏరుకుని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. పక్క నుంచి అతడినే గమనిస్తున్న ఓ వ్యక్తి కూడా చెట్టు కిందకు వెళ్లి అలాగే ప్రయత్నించాడు (Funny Video).
Charging: ఛార్జర్ ఇంటి దగ్గర మర్చిపోయారా? ఛార్జర్ లేకపోయినా మీ ఫోన్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు.. ఇలా ట్రై చేయండి.
చెట్టు కిందకు వెళ్లిన యువకుడు దానిని కాలితో తన్నాడు. అయితే అతడిపై కరెన్సీ నోట్లకు బదులు బకెట్‌తో విసిరిన నీళ్లు పడ్డాయి. దాంతో అది ఫ్రాంక్ వీడియో అని తేలి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 8.6 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ``పాపం.. తనపై కూడా డబ్బులు పడతాయని ఆశ పడ్డాడు``, ``ఆశ మన వివేకాన్ని చంపేస్తుంది``, ``ఎంత నిరాశ పడ్డాడో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-10-21T16:29:40+05:30 IST