ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Monkey Video: ఈ కుర్రాడిపై కోతి పగబట్టిందా ఏంటి..? చుట్టూ వందల మంది ఉన్నా అతడిపైనే అటాక్ చేసి..!

ABN, First Publish Date - 2023-11-22T14:41:21+05:30

అడవులు తగ్గిపోవడం, ఆహార లభ్యత లేకపోవడం మొదలైన కారణాలతో ఇటీవలి కాలంలో కోతులు జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. వాటికి సంబంధించిన రకరకాల ఫన్నీ వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడయో చూస్తూ నవ్వకుండా ఉండలేరు

అడవులు తగ్గిపోవడం, ఆహార లభ్యత లేకపోవడం మొదలైన కారణాలతో ఇటీవలి కాలంలో కోతులు (Monkeys) జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. వాటికి సంబంధించిన రకరకాల ఫన్నీ వీడియోలు (Funny Videos), భయంకర వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే నవ్వకుండా ఉండలేరు. నదిలో స్నానం చేస్తున్న బాలుడిపై కోతి కోపం ప్రదర్శించింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మీరూ నవ్వుకుంటారు (Monkey Video).

comedynation.teb అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో చాలా మంది ఓ నది ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఓ యువ జంట కూడా నదిలో కలిసి స్నానం చేస్తోంది. ఓ కోతి వారిని చూస్తూ మెట్టు మీద కూర్చుంది. అంతలో ఆ అమ్మాయి ఆ కోతిపై నీళ్లు వేసింది. ఆగ్రహించిన కోతిని చూసి అమ్మాయి తప్పించుకుంది. అబ్బాయి దొరికిపోయాడు (Monkey attacks boy). దీంతో ఆ కోతి ఆ కుర్రాడిని టార్గెట్ చేసింది. అతడి పైకి ఎగిరి కొరికేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత కుర్రాడు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే అతడి కాలు పట్టేసుకుంది.

NASA: నాసా విడుదల చేసిన షాకింగ్ ఫొటో.. ఫొటో తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు..!

ఆ కుర్రాడు పారిపోతున్నా వదలకుండా అతడిని తరముకుంటూ వెళ్లింది. చుట్టూ ఉన్న ఆ కోతి తీరు చూసి విస్తుపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. ఆ కుర్రాడేం తప్పు చేయలేదు``, ``అబ్బాయిలు ఎప్పుడూ అలాగే బుక్ అయిపోతుంటారు``, ``కోతికి చాలా కోపం వచ్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-22T14:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising