ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Bite: పాము కరిచిన వెంటనే అంతా తెలియక చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే.. ప్రాణాలే పోతున్నాయ్..!

ABN, First Publish Date - 2023-08-09T15:56:44+05:30

వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు తరచుగా బయట కనిపిస్తుంటాయి. వర్షా కాలంలో పాములు తమ బొరియల నుంచి బయటకు వస్తుంటాయి. సాధారణంగా ఈ సీజన్‌లోనే పాము కాటు ఘటనలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. పాము కాటు వల్ల చాలా మంది చనిపోతుండాడనికి కారణం పాము కరిచిన వెంటనే వారు చేస్తున్న పొరపాట్లే.

వర్షాకాలం (Rainy Season) వచ్చిందంటే చాలు పాములు (Snakes) తరచుగా బయట కనిపిస్తుంటాయి. వర్షా కాలంలో పాములు తమ బొరియల నుంచి బయటకు వస్తుంటాయి. సాధారణంగా ఈ సీజన్‌లోనే పాము కాటు (Snake Bite)ఘటనలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. భారతదేశంలో ఉన్న 250 జాతుల పాములలో, అన్ని పాములు విషపూరితమైనవి కావు. కొన్ని మాత్రమే విషపూరితమైనవి (Poisonous snakes). ప్రస్తుతం దాదాపు అన్ని రకాల పాముల విషానికి మందు ఉంది. అయినప్పటికీ, పాము కాటు వల్ల చాలా మంది చనిపోతుండాడనికి కారణం పాము కరిచిన వెంటనే వారు చేస్తున్న పొరపాట్లే.

మన దేశంలో గత 20 ఏళ్లలో పాము కాటు వల్ల 12 లక్షల మందికి పైగా మరణించారు. వారిలో 97 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. పాము కాటుకు గ్రామీణులు చేసే నాటు వైద్యం, అపనమ్మకాలే చాలా మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. సాధారణంగా పాము కుట్టిన వెంటనే విషం శరీరం అంతా వ్యాపించకుండా గాయం పైన కట్టు కట్టాలని చాలా మందికి తెలుసు. పాము కాటేసిందని తెలిసిన వెంటనే మొదట అందరూ చేసే పని అదే. కొందరు గాయానికి పైన రెండు, మూడు కట్లు గట్టిగా వేసేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరమట. రక్తప్రసరణ అస్సలు జరగకుండా కట్టు కట్టడం చాలా ప్రమాదకరం. అలా చేయడం వల్ల పాము కాటు వేసిన చోట రక్త సరఫరా నిలిచిపోయి ఆ ప్రదేశంలో కణజాలం దెబ్బతింటుంది. అందువల్ల గ్యాంగ్రీన్, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు, రోగి మరణం కూడా సంభవించవచ్చు (Important News).

Viral News: ఒకే బాత్రూంలో ఇరుక్కుపోయిన కుక్క, చిరుతపులి.. చివరకు ఏం జరిగి ఉంటుందో కలలో కూడా ఊహించలేరు..!

పాము కాటుకు గురైన వ్యక్తిని ముందుగా తల పైకి ఎత్తి పడుక్కోనివ్వాలి. పాము కరిచిన భాగాన్ని కదలనివ్వకూడదు. కాలి మీద పాటు కాటు వేస్తే కాలు కదలకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. బాగా కదిలిస్తే విషం శరీరం అంతా వ్యాపిస్తుంది. పాము కాటు వేసిన భాగాన్ని సబ్బు, శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత ఆ భాగాన్ని శుభ్రమైన కాటన్ గుడ్డతో కప్పాలి. వెంటనే రోగిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేదా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి, పాము కాటుకు గురైన గంటలోపు యాంటీ-వెనోమ్ వ్యాక్సిన్ (Anti Venom Vaccine) వేయించాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సురక్షితంగా కోలుకుంటాడు.

Updated Date - 2023-08-09T15:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising