ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఓ బాబును ఎత్తుకుని లాలిస్తున్న పోలీస్ కానిస్టేబుల్.. సడన్‌గా ఈమె ఫొటో వైరల్‌గా మారడం వెనుక కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-07-11T16:29:04+05:30

ఖాకీ దుస్తుల వెనుక కరుడు కట్టిన కాఠిన్యమే కాదు.. సహాయం చేసే సున్నితత్వం కూడా ఉంటుందని నిరూపించింది ఓ మహిళా కానిస్టేబుల్. ఆరు నెలల చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాకీ దుస్తుల వెనుక కరుడు కట్టిన కాఠిన్యమే కాదు.. సహాయం చేసే సున్నితత్వం కూడా ఉంటుందని నిరూపించింది ఓ మహిళా కానిస్టేబుల్ (Female Constable). ఆరు నెలల చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Photo) మారింది. ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ పేరు దయా బెన్‌. ఆమె గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

ఆదివారం గుజరాత్ హైకోర్టు ప్యూన్ పోస్టుకు పరీక్షలు నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రానికి ఓ యువతి తన ఆరు నెలల బిడ్డతో కలిసి చేరుకుంది. పరీక్ష (Exam) ప్రారంభమైన తర్వాత తన భర్తను వచ్చి తీసుకెళ్లమంది. అయితే అతడు ఎంతకీ రాలేదు. మరోవైపు పరీక్షకు సమయం మించిపోతోంది. దీంతో ఆమె తన చిన్నారి (Child)తో పాటే ఎగ్జామ్ హాల్‌కు వెళ్లింది. ఆ ఆరు నెలల చిన్నారి బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. పరిస్థితి గమనించిన దయా బెన్ ఆ యువతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

Viral Video: మందుబాబా మజాకానా.. వరాహంపై అతడి స్వారీ మామూలుగా లేదుగా..!

ఆ యువతిని పరీక్ష రాయమని చెప్పి, ఆమె బిడ్డను దయా బెన్ ఆడించింది. పరీక్ష జరుగుతున్నంత సేపూ కానిస్టేబుల్ దయా బెన్ పరీక్ష హాలు భద్రతతో పాటు చిన్నారి సంరక్షణ బాధ్యతలను కూడా చేపట్టింది. ఈ ఫొటోను అహ్మదాబాద్ పోలీసు విభాగం ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌ను ఇప్పటివరకు 1.43 లక్షల మంది వీక్షించారు. దయా బెన్‌పై చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-07-11T16:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising