Wife: బీర్ బాటిల్‌లో విషం కలిపిన భార్య.. అసలు విషయం తెలియక అంతా తాగేసిన భర్త.. కళ్ల ముందే కట్టుకున్న వాడు చనిపోతున్నా..!
ABN, First Publish Date - 2023-08-14T15:23:59+05:30
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. పరాయి వ్యక్తి ప్రేమలో పడిన వారు తమ భాగస్వామిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. తము ప్రేమించిన వారితో కలిసి భర్తను లేదా భార్యను చంపడం, చివరకు పోలీసులకు దొరికపోవడం తరచుగా జరుగుతోంది.
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు (ExtraMarital Affiars) చిచ్చు పెడుతున్నాయి. పరాయి వ్యక్తి ప్రేమలో పడిన వారు తమ భాగస్వామిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. తము ప్రేమించిన వారితో కలిసి భర్తను లేదా భార్యను చంపడం, చివరకు పోలీసులకు దొరికపోవడం తరచుగా జరుగుతోంది. ఈ క్రమంలో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. తాజాగా రాజస్థాన్ (Rajasthan)లో ఇలాంటిదే ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్త తాగే బీర్ (Beer)లో విషం కలిపిన మహిళ చాలా దారుణంగా వ్యవహరించింది. భర్త నొప్పితో విలవిలలాడుతుంటే ఎదురుగా కూర్చుని ఎంజాయ్ చేసింది (Wife killed Husband).
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సర్దార్‌షహర్ ప్రాంతంలో నివసిస్తున్న పూర్ణారామ్ హత్యకు గురయ్యాడు. అతని హత్య వెనుక భార్య సులోచన, ఆమె ప్రేమికుడు దిలీప్ హస్తం ఉన్నట్టు బయటపడింది. ముందుగా పోలీసులను తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నించిన సులోచన చివరకు నిజం అంగీకరించింది. పూర్ణారామ్ పక్కింట్లో దిలీప్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. దిలీప్‌తో సులోచనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. పూర్ణారామ్ లేని సమయంలో దిలీప్, సులోచన కలుసుకునేవారు. ఆ విషయం పిల్లల ద్వారా పూర్ణారామ్‌కు తెలిసింది. వెంటనే భార్యను మందలించాడు (Crime News).
Marriage: పెళ్లయిన మర్నాడే అత్తారింట్లో ఓ నవ వధువు వింత నిర్వాకం.. పడుకునేముందు అందరికీ మంచినీళ్లు ఇచ్చి మరీ..!
భర్త ఉంటే దిలీప్‌ను కలవడం కుదరదని భావించిన సులోచన ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. దీలీప్ తెచ్చిన విషాన్ని (Poison) భర్త తాగే బీర్ బాటిల్‌లో వేసి కలిపేసింది. ఆ తర్వాత స్వయంగా భర్తకు అందించింది. పూర్ణారామ్ ఆ బీర్ తాగి అస్వస్థకు గురయ్యాడు. రాత్రి 12 గంటల నుంచి నరకయాతన అనుభవించాడు. దాదాపు ఐదు గంటలు తీవ్ర కడుపునొప్పితో బాధపడి ప్రాణాలు కోల్పోయాడు. భర్త అంత బాధపడుతుంటే సులోచన ఎదురుగా కూర్చుని చూస్తుండిపోయింది. భర్త చనిపోయాక ఆ విషయం అందరికీ చెప్పింది. ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించాలనుకుంది. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలైంది. తల్లీ, తండ్రీ లేక పిల్లలు అనాథలుగా మారిపోయారు.
Updated Date - 2023-08-14T15:23:59+05:30 IST