ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MS Dhoni: అభిమానికి ధోనీ సూపర్ గిఫ్ట్.. ఫ్యాన్ కారుపై ఆటోగ్రాఫ్.. వైరల్ వీడియోపై నెటిజన్లు రియాక్షన్లు ఏంటంటే..

ABN, First Publish Date - 2023-11-11T19:03:35+05:30

భారత క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు, అభిమాన గణం సంపాదించుకున్న క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కూడా ధోనీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు.

భారత క్రికెట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు, అభిమాన గణం సంపాదించుకున్న క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కూడా ధోనీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. ధోనీ తన ఆటతీరు, ప్రవర్తనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్ పై అవగాహన ఉన్న ప్రతిఒక్కరూ ధోనీని ఇష్టపడతారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

తాజాగా ధోనీ ఓ అభిమానికి (Dhoni Fan) మరపురాని బహుమతిని అందించాడు. అభిమాని కొన్న బీఎండబ్ల్యూ కారుపై (BMW Car) మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ (Dhoni Autograph) పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @DHONIism అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అభిమాని బీఎండబ్ల్యూ కారు తీసుకుని ధోనీ దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్ అడిగాడు. అభిమాని కోరిక మేరకు ధోనీ కారు వెనుక సీట్లో కూర్చుని సంతకం పెట్టాడు.

Viral Video: ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? ఈ తాతగారు చెప్పింది వినండి.. 94 ఏళ్ల వృద్ధుడి సలహాపై డాక్టర్లు కూడా ప్రశంసలు!

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తక్కువ వ్యవధిలోనే లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ధోనీకి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం ఇదే``, ``ధోనీ బీహారీ యాక్సెంట్ చాలా అద్భుతంగా ఉంది``, ``ధోనీ చాలా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తుంటాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-11T19:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising