ముఖేష్ అంబానీ నివాసంలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలు ఎంత ఉంటాయి? వారికి ఇంకేమి సౌకర్యాలు లభిస్తాయంటే..
ABN, First Publish Date - 2023-04-12T07:44:55+05:30
ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ(Mukesh Ambani) పేరు కూడా ఉందనే విషయం మనకు తెలిసిందే. ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లును యాంటిలియా(Antilia) అని పిలుస్తారు,
ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ(Mukesh Ambani) పేరు కూడా ఉందనే విషయం మనకు తెలిసిందే. ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లును యాంటిలియా(Antilia) అని పిలుస్తారు, ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్(Buckingham Palace) తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ. మీడియా నివేదికల ప్రకారం 4,00,000 చదరపు అడుగులలో విస్తరించి ఉన్న 27-అంతస్తుల యాంటిలియా సంరక్షణ(care) కోసం 600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముఖేష్ అంబానీ తన ఉద్యోగులందరికీ ఆర్థిక భద్రత(Financial security) కల్పించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటారు.
ఇక్కడ పనిచేసే ఉద్యోగుల జీతం(Salary of employees) వింటే ఎవరైనా షాక్ కావాల్సిందే. అంబానీ కోసం వంట చేసే చెఫ్ నెలవారీ జీతం రూ.2 లక్షలు. యాంటిలియాలోని ప్రతి ఉద్యోగి ఇంచుమించు ఇంతే జీతం సంపాదిస్తున్నారని పలు నివేదికలు(Many reports) తెలియజేస్తున్నాయి. వీరికి నెలవారీ జీతంతో పాటు, బీమా సౌకర్యం, ట్యూషన్ రీయింబర్స్‌మెంట్(Reimbursement of tuition) లభిస్తుంది. ఇంతేకాదు ముఖేష్ అంబానీ దగ్గర పనిచేసే కొందరు సిబ్బంది పిల్లలు అమెరికా(America)లో చదువుకుంటున్నారు.
కాగా ముఖేష్ అంబానీ ఇంట్లో ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఉదాహరణకు డ్రైవర్లనే తీసుకుంటే వారు ఏదోఒక ప్రైవేట్ సంస్థ(private company) ద్వారా నియమితులవుతారు. వారు వివిధ రకాల శిక్షణలు పొందుతారు. వీరు వాణిజ్య, లగ్జరీ వాహనాలను నడుపుతారు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్(Financial Express) తెలిపిన వివరాల ప్రకారం యాంటిలియాలోని కార్ల గ్యారేజీలో రూ. 13.50 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, రూ. 10.50 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ బెంజ్ ఎస్ 660 గార్డ్, రూ. 8.9 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 760 ఎల్‌ఐ సెక్యూరిటీ(BMW 760 LI Security) కూడా ఉన్నాయి.
Disha Patani: గ్లామర్ విషయంలో ‘లోఫర్’ బ్యూటీ అస్సలు తగ్గట్లేదుగా..!
Updated Date - 2023-04-12T11:11:00+05:30 IST