ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rip Taraka Ratna: అది తారకరత్నకే దక్కిన రికార్డు!

ABN, First Publish Date - 2023-02-18T23:44:23+05:30

నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి కన్ను మూశారు. జనవరి 26న యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు 26న గుండె పోటు రావడంతో కుప్పం సమీప ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna 40) శనివారం రాత్రి కన్ను మూశారు. జనవరి 26న యువగళం (yuvagalam)పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు 26న గుండె పోటు (heart attack) రావడంతో కుప్పం సమీప ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. తదుపరి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ (narayana hrudayalaya) ఆస్పత్రికి తరలించారు. అక్కడ 23 రోజులు చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తలో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు. (Nandamuri Taraka Ratna is no more)

‘ఒకటో నంబర్‌ కుర్రాడు’ (okato no kurradu) చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన తొలి సినిమాతో విజయం అందుకున్నారు. ఎవరికీ లేని రికార్డ్‌ తారకరత్నకు ఉంది. పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే హీరో మంచి కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ కోసం చూస్తారు. కానీ తారకరత్న విషయంలో అంతకుమించి జరిగింది. హీరోగా తొలి సినిమా ప్రారంభం రోజే తొమ్మిది చిత్రాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఇలా నందమూరి తారకరత్న విషయంలోనే జరిగింది. ఎన్టీఆర్‌కు మనవడు, ఛాయగ్రాకుడు నందమూరి మోహనకృష్ణకు తనయుడైన తారకరత్నను అంత గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ రికార్డుకు 2002 వేదికగా నిలిచింది హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోలో ఒకేరోజున తొమ్మిది చిత్రాలకు కొబ్బరికాయ కొట్టారు తారకరత్న. (RIP Nandamuri Taraka Ratna )

ఆ ఆలోచన బాలకృష్ణదే! ( Taraka Ratna 9 movies record)

తాత ఎన్టీఆర్‌ మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజులకు అంటే 1983 ఫిబ్రవరి 22న పుట్టారు తారకరత్న. కల్యాణ్‌రామ్‌ కంటే ఐదేళ్లు చిన్నవాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు నాలుగు నెలలు పెద్ద. బాబాయ్‌ బాలకృష్ణను తెరపై చూస్తూ పెరిగిన తారకరత్నకు చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఆయనతో మంచి చనువు ఉండడంతో హీరో కావాలనే కోరికను బాలయ్య ముందుంచాడు తారకరత్న. ఆయన తన సోదరులతో మాట్లాడి వారిని ఒప్పించి, తారకరత్నను హీరోగా పరిచయం చేశారు. ఒకేరోజు తొమ్మిది సినిమాలతో తారకరత్న పరిచయం కావాలన్న ఆలోచన కూడా బాలకృష్ణదే అని కుటుంబ సభ్యులు చెబుతారు. ఆ తొమ్మిది సినిమాలకు తాలుక బాధ్యతలన్నీ బాలకృష్ణే తీసుకున్నారని, దర్శకులను, నిర్మాణ సంస్థలన నిర్ణయించింది కూడా బాలకృష్ణే. అయితే ఆ రోజు తొమ్మిది సినిమాలు మొదలైనా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలైన ఏకైక చిత్రం ‘ఒకటో నంబర్‌ కుర్రాడు’. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌ నిర్మాతలు. 2002లో విడుదలైందీ చిత్రం. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినా తారకరత్న కెరీర్‌ అనుకున్నంత సాఫీగా సాగలేదు. హీరోగా 20కు పైగా చిత్రాల్లో నటించినా ఒకటీ సరైన విజయం సాధించకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. కొన్ని యావరేజ్‌గా ఆడినా ఆయన కెరీర్‌కు మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు.

విలన్‌ పాత్రకు నంది పురస్కారం... (nandi award for Villian)

తారకరత్న 20కి పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో ‘ఒకటో నెం. కుర్రాడు’, యువరత్న, ‘నందీశ్వరుడు’, ‘భద్రాది రాముడు’, ‘మహాభక్త శిరియాళ’ చిత్రాలు తారకరత్నకు గుర్తింపు తెచ్చాయి హీరోగానే కాకుండా ‘అమరావతి’, ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా తారకరత్న నటించారు. ‘అమరావతి’ చిత్రంతో నంది అవార్డ్‌ కూడా అందుకొన్నారు. విలన్‌గా కూడా ఆయన ప్రయాణం ఆశించిన విధంగా సాగలేదు. 2021లో దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా తీసిన ‘దేవినేని’ చిత్రంలో టైటిల్‌ పాత్ర పోషించారు. ఆ చిత్రం ఫలితం కూడా అంతంత మాత్రమే. గత ఏడాది ఆయన ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. ‘9 అవర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. దీనికి ఓటీటీలో చక్కని ఆదరణ లభించింది.

ప్రేమ వివాహంతో ఇక్కట్లు... (Love marriage)

నందమూరి తారకరత్నది ప్రేమ వివాహం. అప్పటి వరకూ నందమరి కుటుంబంలో ప్రేమ వివాహాలు అనేవి లేదు. అన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే. కానీ మొదటిసారి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. తన స్నేహితురాలు అలేఖ్యా రెడ్డిని 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అలేఖ్యా రెడ్డికి పెళ్లై విడాకులు తీసుకుంది. అలేఖ్య ఎవరో కాదు. వైసీపీ నాయకుడు విజయ్‌సాయిరెడ్డి మరదలి కూతురు. కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా ఆమె పని చేశారు. తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు కూడా ఆమె వర్క్‌ చేశారు. అలా పరిచయమైన అలేఖ్యను తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకు ఆగ్రహించిన నందమూరి కుటుంబ సభ్యులు ఆయన్ను కొంతకాలం దూరం పెట్టారు. తదుపరి కుటుంబ సభ్యులు ఆయన్ను దగ్గరికి తీసుకున్నారు.

Updated Date - 2023-02-18T23:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising