Neelagiri: ఇక్కడ ఎలుగుబంట్లు పట్టపగలు, ప్రధాన రహదారిలో తిరుగుతున్నాయి..
ABN, First Publish Date - 2023-06-24T11:42:20+05:30
కోత్తగిరి సమీపం కున్నూరు రహదారిలో మూడు ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కున్నూ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నీలగిరి(Neelagiri) జిల్లా కోత్తగిరి సమీపం కున్నూరు రహదారిలో మూడు ఎలుగుబంట్లు సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కున్నూరు రహదారిలోని కన్నికాదేవి కాలనీలో రెండు చిన్న ఎలుగుబంట్లను వెంటబెట్టుకుని ఓ పెద్ద ఎలుగుబంటు సంచరిస్తోంది. ఆ మార్గంలో వెళుతున్న పాదచారులు, వాహనచోదకులు గమనించి ఆ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. సమాచారం అందుకుని అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆలోపున ఆ మూడు ఎలుగుబంట్లు మాయమయ్యాయి. దీంతో ఎలుగుబంట్లను పట్టుకునేందుకు ఆ కాలనీ వద్ద బోనును ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
Updated Date - 2023-06-24T11:42:20+05:30 IST