Old Man: ఈ వయసులో ఎందుకీ కష్టం తాతా.. రెస్ట్ తీసుకోవచ్చుగా..? అని ఓ కస్టమర్ చెప్తే.. ఈ పెద్దాయన నోట షాకింగ్ సమాధానం..!
ABN, First Publish Date - 2023-07-28T18:01:49+05:30
వయసులో ఉన్నప్పుడు నాలుగు రూపాయలు సంపాదించి.. వృద్ధాప్యంలో హాయిగా విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇందుకు తగ్గట్టుగానే కొందరు తమ జీవితాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తాత ...
వయసులో ఉన్నప్పుడు నాలుగు రూపాయలు సంపాదించి.. వృద్ధాప్యంలో హాయిగా విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇందుకు తగ్గట్టుగానే కొందరు తమ జీవితాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తాత మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. యుక్త వయసు నుంచి కష్టపడుతున్న ఈ వృద్ధుడు.. వృద్ధాప్యంలోనూ రెస్ట్ తీసుకోలేదు. ఈయన కష్టాన్ని చూసిన ఓ కస్టమర్.. ‘‘ఈ వయసులో ఎందుకీ కష్టం తాతా... రెస్ట్ తీసుకోవచ్చుగా’’.. అని చెప్పగా.. ఆ పెద్దాయన చెబుతున్న సమాధానం ఏంటంటే..
సోషల్ మీడియాలో ఓ వృద్ధుడికి సంబంధించిన వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‍లోని (Rajasthan Udaipur) కోర్ట్ సర్కిల్ వద్దకు వెళ్లగానే సమీపంలో రోడ్డు పక్కన ఓ వృద్ధుడు.. వేడి వేడి సమోసాలు (old man selling samosas) అమ్ముతూ కనిపిస్తాడు. వృద్ధాప్యంలో ఉండి కూడా కష్టపడి సమోసాలు విక్రయిస్తున్న ఈయన్ని చూసి అంతా.. ‘‘అయ్యో! పాపం.. ఎంత కష్టమొచ్చింది’’.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల కారులో అక్కడికి వెళ్లిన ఓ యువకుడు.. వృద్ధుడి కష్టం చూసి చలించిపోయాడు. దగ్గరికి వెళ్లి పరామర్శించాడు. ‘‘ఈ వయసులో కూడా ఎందుకు తాతా ఈ కష్టం.. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చుగా’’.. అని అన్నాడు.
యువకుడి ప్రశ్నకు పెద్దాయన.. ‘‘బాబూ, నేడు డబ్బుల కోసం పని చేయలేదు. ఈ పని నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఒంటిరిగా కూర్చోవడం కంటే.. ఇక్కడ సమోసాలు చేయడమే కాకు ఇష్టం. నేను చేసిన పదార్థాలను రుచి చూసే వారి మొఖాలను చూస్తే నా కడుపు నిండిపోతుంది’’.. అని బదులిచ్చాడు. సదరు యువకుడు వృద్ధుడి గురించి వివరిస్తూ.. ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘మనసుకు నచ్చిన పని చేయడంలో ఉండే ఆనందమే వేరు’’.. అని కొందరు, ‘‘ఈ వయసులోనూ కష్టపడుతున్న పెద్దాయనకు హ్యాట్సాప్’’.. అంటూ మరికొందరు, ‘‘నేటి యువతి ఈయన్ను ఆదర్శంగా తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Infertility Reasons: ఏవేవో అనుకుంటుంటారు కానీ.. పిల్లలు పుట్టకపోవడానికి ఈ 8 అంశాలే అసలు కారణాలు..!
Updated Date - 2023-07-28T20:43:13+05:30 IST