ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

ABN, First Publish Date - 2023-03-10T20:11:18+05:30

ప్రస్తుత హెటెక్ యుగంలో అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నట్లే.. డబ్బు చెల్లింపుల్లోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. చేతిలో రూపాయి లేకున్నా.. మొబైల్ ఉంటే చాలు.. దేశం చుట్టేసి వచ్చే పరిస్థితులు వచ్చాయి. రూపాయి దగ్గర నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుత హెటెక్ యుగంలో అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నట్లే.. డబ్బు చెల్లింపుల్లోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. చేతిలో రూపాయి లేకున్నా.. మొబైల్ ఉంటే చాలు.. దేశం చుట్టేసి వచ్చే పరిస్థితులు వచ్చాయి. రూపాయి దగ్గర నుంచి లక్షల రూపాయల వరకూ డిజిటల్ లావాదేవీలు చేసుకునే వెసులుబాటు రావడంతో నగదు లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. కూరగాయల నుంచి ఏం కొనాలన్నా.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం (Google Pay, PhonePe, Paytm) ద్వారానే చేస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వివాహ కార్యక్రమంలో చదివింపులు సమర్పించుకునే వారి కోసం ఏకంగా QR Code ఏర్పాటు బోర్డ్ చేశారు. ఇందుకు సబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. వివాహ వేదికపై వధూవరులు (bride and groom) ఆసీనులై ఉంటారు. వరుడు కామ్‌గా కూర్చుని ఉండగా.. వధువు స్వీట్ తింటూ ఉంటుంది. చదివింపులు, గిఫ్టులు ఇచ్చే క్రమంలో స్టేజి పైకి వెళ్లే ఇబ్బంది లేకుండా పక్కనే ఓ క్యూఆర్ కోడ్ (QR Code) బోర్డ్ ఏర్పాటు చేసి ఉంటారు. నగదు పంపాలనుకునే వారంతా అక్కడికి వెళ్లి, స్కాన్ చేసి ఎవరికి తోచినంత వారు పంపిస్తున్నారు. దీంతో వధూవరులు ఫ్రీగా కూర్చుని ఉంటారు. అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తి చేసిన పని అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది.

Viral Video: ఎవరూ లేని సమయం చూసి.. బైకుపై కూర్చున్న బాలిక.. అపవిత్రమైందంటూ చివరకు యజమాని చేసిన పని..

సరాసరి క్యూఆర్ కోడ్ వద్దకు వెళ్లిన అతను.. మొబైల్‌లోని ఫోన్ పే (PhonePe) ద్వారా స్కాన్ చేస్తాడు. ఎంతలేదన్నా వంద నుంచి వేల రూపాయల్లో నగదు పంపుతాడని అంతా అనుకుంటారు. కానీ అతను మరీ విచిత్రంగా కేవలం ఒకే ఒక్క రూపాయి పంపించాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ వ్యక్తి ఎవరో మహానుభావుడు.. అంటూ కొందరు, కామెడీ కోసం కావాలనే అలా చేశారు.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

Marriage Photos: అయ్యబాబోయ్.. ఇలాంటి బంధువులు ఉంటే ఇక పెళ్లిళ్లు అయినట్టే.. వరుడికే చిర్రెత్తుకొచ్చి పెళ్లిని ఆపేసినంత పనిచేశాడు..!

Updated Date - 2023-03-10T20:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising