Wife-Husband: కూరగాయలు తెమ్మంటూ భర్తకు ఓ స్లిప్ ఇచ్చిందో భార్య.. ఆమె రాసింది చదివి నెట్టింట పేలుతున్న సెటైర్లు..!
ABN, First Publish Date - 2023-09-07T16:25:32+05:30
షాపింగ్ చేయడంలో మగవారి కంటే ఆడవారే ముందుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటికి సంబంధించిన సరుకుల దగ్గర నుంచి వివిధ రకాల సమాన్లు, దుస్తులు తదితరాల వరకూ అన్నీ గుర్తు పెట్టుకుని మరీ షాపింగ్ చేస్తుంటారు. అయితే ఈ విషయంలో...
షాపింగ్ చేయడంలో మగవారి కంటే ఆడవారే ముందుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంటికి సంబంధించిన సరుకుల దగ్గర నుంచి వివిధ రకాల సమాన్లు, దుస్తులు తదితరాల వరకూ అన్నీ గుర్తు పెట్టుకుని మరీ షాపింగ్ చేస్తుంటారు. అయితే ఈ విషయంలో మగవారు మాత్రం చాలా వెనుకబడి ఉంటారు. బడ్జెంట్ తగ్గించుకునే క్రమంలో కొందరు, సరుకుల లిస్ట్ గుర్తు పెట్టుకోలేక మరికొందరు.. ఒకటి తెమ్మంటే మరోటి తెస్తుంటారు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ వాగ్వాదం చోటు చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో ఓ మహిళ చాలా తెలివిగా ఆలోచించింది. తన భర్తకు రాయించి ఇచ్చిన సరుకుల లిస్ట్ చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ మహిళ (woman) తన భర్తకు కూరగాయలు (Vegetables List) తెమ్మంటూ ఓ లిస్ట్ రాసిచ్చింది. పేపర్లో ఆమె రాసిన వివరాలు చూసి ఆమె భర్తతో పాటూ నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా కూరగాయల పేర్లు, కేజీల వివరాలు రాస్తూ ఉంటారు. కానీ ఈ మహిళ మాత్రం అత్యంత తెలివిగా వ్యవహరిస్తూ.. కూరగాయల పేర్లు, కేజీల వివరాలతో పాటూ.. సైజు, కలర్, డిజైన్.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా వివరించడంతో పాటూ ఏకంగా బొమ్మలు కూడా గీసి పంపించింది.
స్కూల్లో చిన్న పిల్లలకు వివరంగా చెప్పినట్లు తన భర్తకు కూడా అదేవిధంగా సవివరంగా చెప్పింది. తాను చెప్పిన కూరగాలు తూచా తప్పకుండా చచ్చినట్లు తెచ్చేలా ఆమె రాసిన లిస్ట్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వార్తకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ మహిళ తెలివి మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘ఇంత వివరంగా చెబితే తేక చస్తాడా’’.. అని మరికొందరు, ‘‘ఎలా వస్తాయమ్మా.. ఇలాంటి ఐడియాలు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-07T16:25:32+05:30 IST