కంగారుపెట్టిస్తున్న కొత్త వైరస్..ఆ వ్యాధులు ఉన్నవారికి ముప్పే..!
ABN, First Publish Date - 2023-02-22T09:32:32+05:30
కరోనా(Corona) కేసులు తగ్గుముఖం పట్టాయి అనే లోపు.. పశ్చిమ బెంగాల్(West Bengal)ను...
కరోనా(Corona) కేసులు తగ్గుముఖం పట్టాయి అనే లోపు.. పశ్చిమ బెంగాల్(West Bengal)ను అడెనోవైరస్(Adenovirus) వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ బారినపడిన చిన్నారులతో హాస్పటల్ నిండిపోతున్నాయి. తాజాగా 6 నెలలు వయసున్న బాబుతో పాటు రెండున్నరేళ్ల బాలిక మృతి చెందారు. అయితే ఇద్దరు చిన్నారులు అడెనో వైరస్ కారణంగా మృతి చెందారని అధికారులు ధృవీకరించలేదు. ఈ వైరస్ సోకిన చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. అడెనో వైరస్ బారినపడ్డవారిలో జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో పాటు నిమోనియా తీవ్రమైన గ్యాస్ట్రో వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
అడెనో వైరస్ సోకితే తెలికగా తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. తెలికపాటి లక్షణాలున్న తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందంటున్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి..శ్వాసకోశ.. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అన్నీ వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుందని, రోగులు దగ్గడం, తుమ్మడం, తాకడం వల్ల ఈ వైరస్ ఒకరిని నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ వైరస్ బారిన పడినవారికి నిర్ధిష్టమైన చికిత్స లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడిన చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నొప్పి నివారణను మందును ఉపయోగించడంతో తెలికపాటి.. లక్షణాలని తగ్గిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే..ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ బారినపడ్డవారితో టచ్ లో ఉండదని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Updated Date - 2023-02-22T09:34:40+05:30 IST