Viral: హనీమూన్కు వచ్చిన భర్తకు షాక్.. హోటల్ రూమ్ నుంచి భార్య పరారీ.. ఆమె వెళ్లిపోవడానికి కారణమేంటో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-08-09T18:42:24+05:30
ఆ ఇద్దరికీ ఇటీవలె పెళ్లి జరిగింది.. వివాహం తర్వాత ఇద్దరూ హనీమూన్ కోసం వెళ్లారు.. అయితే హనీమూన్ సమయంలో భర్తపై భార్య అలిగింది.. అతడికి చెప్పా పెట్టకుండా హోటల్ నుంచి వెళ్లిపోయింది.. భార్య లేదని తెలిసి షాకైన భర్త ఆమె కోసం తీవ్రంగా గాలించాడు.. చివరకి అసలు విషయం తెలుసుకుని షాకయ్యాడు..
ఆ ఇద్దరికీ ఇటీవలె పెళ్లి (Marriage) జరిగింది.. వివాహం తర్వాత ఇద్దరూ హనీమూన్ (Honeymoon) కోసం వెళ్లారు.. అయితే హనీమూన్ సమయంలో భర్తపై భార్య అలిగింది.. అతడికి చెప్పా పెట్టకుండా హోటల్ నుంచి వెళ్లిపోయింది.. భార్య లేదని తెలిసి షాకైన భర్త ఆమె కోసం తీవ్రంగా గాలించాడు.. చివరకి అసలు విషయం తెలుసుకుని షాకయ్యాడు.. రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్లో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని భోపాల్ (Bhopal)కు చెందిన ఓ జంటకు జూలై 29న వివాహం జరిగింది. ఆ తర్వాత వారు హనీమూన్ కోసం ఆగస్టు 5న జైపూర్ (Jaipur) వెళ్లారు. చౌము పులియా సమీపంలోని ఓ హోటల్లో బస చేశారు. జైపూర్లో అమెర్ కోటను సందర్శించి, 3 గంటలకు తిరిగి హోటల్ (Hotel)కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత బాబా ఖతుశ్యాం జీ ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారు. అక్కడకు వెళ్లేందుకు వాహనం బుక్ చేయడానికి భర్త (Husband) బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చేసరికి గదిలో అతడి భార్య (Wife), ఆమె వస్తువులు కనిపించలేదు. ఆమె కోసం హోటల్ అంతా వెతికాడు. ఫోన్ చేశాడు. కానీ ఆమె స్పందించలేదు.
Viral: ప్రేమలో ఓటమితో డిప్రెషన్.. ఒంటరిగా ఉండలేక బొమ్మతో ప్రేమ పెళ్లి.. ముగ్గురు పిల్లలు కూడా..
హోటల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఫోన్లో మాట్లాడుతూ ఆ మహిళ హోటల్ నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో భర్త వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన భార్యకు హోటల్ రూమ్ విషయంలో వాగ్వాదం జరిగిందని, ఆ మాత్రం దానికే ఆమె అలిగి ఎక్కడికో వెళ్లిపోయిందని, ఆమెను పట్టుకోవాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - 2023-08-09T18:42:24+05:30 IST