ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పరీక్షలో అడిగిన ప్రశ్ననే సమాధానంగా రాసిన విద్యార్థిపై పొగడ్తల వర్షం కురిపించిన టీచర్.. అదేంటని అవాక్కవుతున్నారా..?

ABN, First Publish Date - 2023-04-01T18:48:39+05:30

కొందరు పిల్లలు తెలివిగా ప్రవర్తిస్తే.. మరికొందరు పిల్లలు అతి తెలివిగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు పిల్లలకైతే ఎవరికీ రాని ఐడియాలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వారు చేసే పనులు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొందరు పిల్లలు తెలివిగా ప్రవర్తిస్తే.. మరికొందరు పిల్లలు అతి తెలివిగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు పిల్లలకైతే ఎవరికీ రాని ఐడియాలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వారు చేసే పనులు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ విద్యార్థికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పరీక్షలో అడిగిన ప్రశ్ననే సమాధానంగా రాసిన విద్యార్థిపై టీచర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇంతకీ అదేంటబ్బా అని అవాక్కవుతున్నారా..

సోషల్ మీడియాలో పరీక్షలో విద్యార్థి రాసిన సమాధానానికి సంబంధించిన ఫొటో వైరల్ (Viral photos) అవుతోంది. సాధారణంగా ఏ విద్యార్థి (student) అయినా ప్రశ్నను చూడగానే సమాధానం తెలిస్తే వెంటనే రాసేస్తాడు. లేదంటే చాలా సేపు బుర్ర బద్దలుకొట్టుకుని చివరికి తప్పో ఒప్పో ఏదోటి రాసేస్తాడు. ఇంకొందరు విద్యార్థులు తలాతోక లేని సమాధానాలను రాస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విద్యార్థి మాత్రం ప్రశ్నలోనే సమాధానాలను (Question and answers) వెతుక్కున్నాడు.

Viral Video: ప్రశ్నల నెంబర్లు వేసి మరీ టీచర్‌ను పొగుడుతూ సమాధానాలు.. ఆ విద్యార్థికి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తే..

‘‘write five words you can spell’’.. ఏవైనా ఐదు పదాలు రాయమన్న ఈ ప్రశ్నకు సమాధానాలను తెలివిగా ప్రశ్నలోనే వెతుక్కున్నాడు. అతడు రాసిన పదాలు వరుసగా.. 1. five, 2. words, 3.you, 4.can, 5.spell.. ఇలా ఈజీగా రాసిపడేశాడు. అయితే ఈ విద్యార్థి తెలివి చూసి టీచర్ ఎంతో సంతోషించారు. సమాధానాలను తెలివిగా రాసినందుకు గానూ.. వెరీ క్లెవర్ అంటూ మరో రెండు మార్కులు ఎక్కువ వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Bride Video: పెళ్లి ఫొటోల కోసం సరదాగా ఇలా ఫోజులు పెట్టడమే ఈ వధూవరుల కొంపముంచింది.. అప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు కానీ..

Updated Date - 2023-04-01T18:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising