Horrific Visuals: భయానక ఘటన.. 9 ఆవులు కలిసి ఒకేసారి మహిళపై దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-09-01T13:51:37+05:30
నడిరోడ్డుపై పశువులు (Stray Animals) బీభత్సం సృష్టిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలతో వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులు ఉన్నట్టుండి దాడులు చేయడంతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నడిరోడ్డుపై పశువులు (Stray Animals) బీభత్సం సృష్టిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలతో వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులు ఉన్నట్టుండి దాడులు చేయడంతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. కొన్ని రోజుల ముందు చెన్నై (Chennai) లో ఓ చిన్నారి ఇలాంటి ఘటనలోనే ప్రాణాలు కోల్పోయింది కూడా. ఈ ఘటనను మరువకు ముందే తాజాగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) లో మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.
వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నఓ మహిళపై ఉన్నట్టుండి ఓ ఆవు దాడి చేసింది. అంతే.. ఆ తర్వాత మరో ఎనిమిది వరకు ఆవులు గుంపుగా అక్కడికి వచ్చేశాయి. మహిళపై కొద్దిసేపు విరుచుకుపడ్డాయి. బాధితురాలు కాపాడంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి వచ్చారు. చేతికి అందిన వాటితో ఆ అవుల మందను అక్కడి నుంచి తరిమికొట్టారు. దాంతో అవి అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Viral Video: పెద్ద ఎద్దుతో కారులో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. అసలు విషయం తెలిసి హర్షం..!
Updated Date - 2023-09-01T13:51:37+05:30 IST