ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అమ్మాయి కాదండీ.. అచ్చంగా అబ్బాయే.. మోకాళ్ల వరకు జుట్టుతో ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న 15 ఏళ్ల కుర్రాడు..!

ABN, First Publish Date - 2023-09-20T13:56:30+05:30

ఒత్తుగా జుట్టు పెంచడం అంటే మాటలు కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు విషయంలో అమ్మాయిలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పొడవు జడ ఉన్న అమ్మాయిలను అందరూ అపురూపంగా చూస్తారు. గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల సిదక్‌ దీప్ సింగ్ అనే బాలుడు జుట్టు విషయంలో అమ్మాయిలనే మించి పోయాడు.

ఒత్తుగా జుట్టు (Long Hair) పెంచడం అంటే మాటలు కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు విషయంలో అమ్మాయిలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పొడవు జడ ఉన్న అమ్మాయిలను అందరూ అపురూపంగా చూస్తారు. గ్రేటర్ నోయిడా (Greater Noida)కు చెందిన 15 ఏళ్ల సిదక్‌ దీప్ సింగ్ (Sidakdeep Singh) అనే బాలుడు జుట్టు విషయంలో అమ్మాయిలనే మించి పోయాడు. ఆ కుర్రాడు పుట్టినప్పటి నుంచి జుట్టును ఒక్కసారిగా కూడా కత్తిరించలేదు. దీంతో ఆ అబ్బాయి జుట్టు చాలా పొడవుగా పెరిగింది. ఎంతలా అంటే.. ఆ కుర్రాడు తన జుట్టుతో ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డునే (Guinness Book of World Records) సాధించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల సిదక్‌ దీప్ సింగ్ చాహల్ పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అత్యంత పొడవాటి జుట్టు (Longest Hair) కలిగి ఉన్న టీనేజ్ యువకుడిగా సిదక్‌ దీప్ పేరు గిన్నీస్ బుక్‌లోకి ఎక్కింది. దీంతో సిదక్‌ దీప్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. తన రికార్డు గురించి, జుట్టు పెంచుకోవడం వల్ల ఎదురైన సమస్యల గురించి సిదక్‌ దీప్ మాట్లాడాడు. ``నాకు ఈ ఘనత దక్కడంలో మా అమ్మ పాత్రే కీలకం. మా నాన్న కూడా నాకు మద్దతుగా నిలిచారు. సిక్కు మతానికి చెందిన నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా జుట్టు కత్తిరించుకోలేద``ని సిదక్ చెప్పాడు.

Aadhaar Card: సెప్టెంబర్ 30వ తారీఖే ఆఖరు తేదీ.. మరో 10 రోజుల్లో ఈ పని చేయకపోతే ఆ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్..!

``నా వయస్సు ఇప్పుడు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి నా జుట్టు పెరుగుతూనే ఉంది. జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నాను. నా జుట్టు చూసి స్నేహితులు ఏడిపించేవారు. అమ్మాయినని చెప్పి నాతో ఆడుకోవడానికి వచ్చే వారు కాదు. అయినా నేను పట్టించుకోలేదు. భవిష్యత్తులో నా జుట్టును మరింత పెంచుకోవాలని, నా రికార్డును రెండు మూడు సార్లు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాన``ని చెప్పాడు. అలాగే నేటి సిక్కు యువత తోటివారి ఒత్తిడి వల్లనో లేదా స్టైల్ కోసమో జుట్టు కత్తిరించుకుంటున్నారని, జుట్టును పెంచుకోవడం ద్వారా సిక్కు మూలాలను కాపాడుకోవాలని సిదక్ దీప్ సూచించాడు.

Updated Date - 2023-09-20T13:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising