Join My Wedding: పెళ్లి చేసుకోండి.. లక్షల్లో సంపదించుకోండి.. నమ్మశక్యంగా లేదా? అది ఎలాగంటే..?
ABN, First Publish Date - 2023-08-12T19:15:29+05:30
సాధారణంగా పెళ్లి తంతు అనేది ఖర్చుతో కూడుకున్న పని. గెస్టుల లిస్ట్ దగ్గర నుంచి నగలు, కట్నకానుకలు, పెళ్లి మండపం అంటూ అప్పగింతల దాకా.. తడిసి మోపెడవుతుంది. ప్రతీ కుటుంబంలోనూ..
సాధారణంగా పెళ్లి తంతు అనేది ఖర్చుతో కూడుకున్న పని. గెస్టుల లిస్ట్ దగ్గర నుంచి నగలు, కట్నకానుకలు, పెళ్లి మండపం అంటూ అప్పగింతల దాకా.. తడిసి మోపెడవుతుంది. ప్రతీ కుటుంబంలోనూ పెళ్లి అనేది ప్రతిష్టాత్మకమైన సందర్భం కాబట్టి.. దీనిని గ్రాండ్‌గా నిర్వహించారు. కొందరు తమ ఆస్తులు అమ్మి మరీ.. ఘనంగా పెళ్లిళ్లు చేస్తారు. అయితే.. ఇకపై పెళ్లి ఖర్చుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ‘పెళ్లి’ ద్వారా కూడా భారీగా డబ్బులు సంపాదించవచ్చు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. పైగా.. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అదెలా అంటే..
మన భారతీయ పెళ్లిళ్లు ఎంతో సాంప్రదాయబద్దంగా, హుందాగా జరుగుతాయి. విదేశీయులతో పోలిస్తే.. మన భారతీయ పెళ్లిళ్లలో సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడతాయి. పైగా.. వందలాది సంఖ్యలో అతిథులు విచ్చేస్తుంటారు. చూడ్డానికి.. ఈ పెళ్లి తంతు ఏదో ఒక పండుగలాగా అనిపిస్తుంది. అందుకే.. మన భారతీయ పెళ్లిళ్లలో పాల్గొనడానికి విదేశీయులు ఎంతో ఇష్టపడతారు. అలా వచ్చిన విదేశీ అతిథులు.. కొంచెం డబ్బు కూడా ఇచ్చి వెళ్తారు. ఈ విధానంలోనే మీరు మీ ఇంట్లో జరిగే పెళ్లి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే.. విదేశీ అతిథుల్ని మీ పెళ్లికి పిలిస్తే, వాళ్లు డబ్బులిచ్చి వెళ్తారు. ఇందుకు మీరు ‘JOIN MY WEDDING’ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో లాగిన్ అయ్యి, విదేశీయుల్ని మీ పెళ్లికి ఆహ్వానించాలి.
విదేశాల నుంచి భారతదేశాన్ని పర్యటించేందుకు వచ్చే విదేశీ అతిథులు.. ఇక్కడ పెళ్లిళ్లు ఎక్కడెక్కడ జరుగుతాయన్న వివరాల్ని శోధిస్తుంటారు. ‘JOIN MY WEDDING’ పోర్టల్ వారికి ఈ మార్గాన్ని సుగమం చేసింది. ఈ వెబ్‌సైట్‌లో దేశంలో ఎక్కడెక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయనే వివరాలు ఉంటాయి. ఫలానా పెళ్లికి హాజరవ్వాలని విదేశీ అథితులు నిర్ణయించుకుంటే, వాళ్లు కొంత మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. అలా వాళ్లు కట్టిన డబ్బుల్లో నుంచి కొంచెం వాటాను.. పెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. ఇలా.. ఆ పోర్టల్ సహకారంతో డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే వెళ్లి, ఆ పోర్టల్‌లో మీ పెళ్లి వివరాల్ని నమోదు చేసుకోండి.
Updated Date - 2023-08-12T19:15:29+05:30 IST