ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

jasmine flowers: గుబులు పుట్టించావు ఓ ‘మల్లి’కా..

ABN, First Publish Date - 2023-07-22T09:23:31+05:30

స్థానిక కోయంబేడు మార్కెట్‌లో మల్లెపూల(jasmine flowers) ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఆడి మాసం తొలి శుక్రవారం కావడంతో

- కోయంబేడు మార్కెట్‌లో కిలో రూ.వెయ్యి

అడయార్‌(చెన్నై): స్థానిక కోయంబేడు మార్కెట్‌లో మల్లెపూల(jasmine flowers) ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఆడి మాసం తొలి శుక్రవారం కావడంతో మార్కెట్‌లో అన్ని పూల ధరలు పెరిగిపోయాయి. వీటిలో మల్లెపూల ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో మల్లెపూలు శుక్రవారం రూ.1000 పలికాయి. దీంతో పూల వ్యాపారులు తెగ ఆనందపడిపోతున్నారు. గురువారం కిలో మల్లెపూల ధర రూ.500 ఉండగా శుక్రవారం ఏకంగా రూ.1000 పలికింది. అలాగే జాజిమల్లి, ఐస్‌మల్లి కిలో రూ.350, కనకాంబరాలు రూ.300, చామంతి రూ.240, సంపంగి రూ.180, పన్నీర్‌ రోజ్‌ రూ.100, చాక్లెట్‌ రోజ్‌ రూ.80, అరలి రూ.200 చొప్పున విక్రయించారు. ఒక్కసారిగా ధరలు పెరుగుదలపై కోయంబేడు(Koyambedu) పూల మార్కెట్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ముత్తురాజ్‌ మాట్లాడుతూ... ఆడిమాసం తొలి శుక్రవారం కావడంతో ఒక్కసారిగా పూలకు డిమాండ్‌ పెరిగిందన్నారు. పూల రైతులతో పాటు వ్యాపారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే, ధరలు పెరిగినప్పటికీ వీటిని కొనుగోలు చేసేందుకు చిరు వ్యాపారులు పోటీ పడటంతో మార్కెట్‌కు వచ్చిన పూలన్నీ గంటల్లోనే విక్రయమయ్యాయి.

Updated Date - 2023-07-22T09:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising