ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha: ఇద్దరు బాలురు వీధి కుక్కలను పెళ్లాడారు...ఎందుకంటే...

ABN, First Publish Date - 2023-04-19T07:52:38+05:30

వివాహాలు ప్రాంతాలు, గిరిజన తెగలను బట్టి వివిధ రకాల ఆచారాలు, సంప్రదాయాలు...

Odisha Minors married to dogs
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాసోర్ (ఒడిశా): వివాహాలు ప్రాంతాలు, గిరిజన తెగలను బట్టి వివిధ రకాల ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ పట్టణంలో ఇద్దరు గిరిజన పిల్లలు(Odisha minors) రెండు వీధి కుక్కలను వివాహం చేసుకున్న(Married to dogs) ఘటన సంచలనం రేపింది. బాలాసోర్ సమీపంలోని సోరో బ్లాక్ బంద్ సాహి గ్రామానికి చెందిన తపన్ సింగ్ అనే 11 ఏళ్ల బాలుడు ఆడ కుక్కను, బుటు కుమార్తె అయిన ఏడేళ్ల వయసు గల లక్ష్మీ ఒక మగ కుక్కను వివాహం చేసుకున్నారు. మైనర్ పిల్లలకు దుష్టశక్తులను పారదోలేందుకే(ward off evil spirits) ఇలా వీధి కుక్కలతో పెళ్లి జరిపించేశామని గ్రామస్థులు చెప్పారు.

ఇది కూడా చదవండి : Layoffs : డిస్నీలో వచ్చే వారం మరో విడత ఉద్యోగాల కోత

హో తెగకు చెందిన గిరిజనులు పిల్లల దవడలపై దంతాలు వచ్చిన తర్వాత ఇలా పెళ్లి చేసేందుకు కుక్కల కోసం అన్వేషిస్తారు. పిల్ల దవడలపై దంతాలు కనిపించడం అశుభం అని గిరిజనుల విశ్వాసం.ఇలా కుక్కలతో పెళ్లి చేస్తే దుష్టశక్తులు పారిపోతాయని గ్రామస్థులు చెప్పారు. సమాజ సంప్రదాయాల ప్రకారం తమ గ్రామంలో కుక్కలతో పెళ్లి చేస్తున్నారని గ్యాడ్యుయేట్ విద్యార్థి సాగర్ సింగ్ చెప్పారు. కుక్కలతో పెళ్లి నిశ్చయమైన తర్వాత జరిగే చెడు కుక్కలకి చేరుతుందని గిరిజన సమాజం విశ్వసిస్తోంది. ఈ విశ్వాసాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకపోయినా, పెద్దలు మూఢనమ్మకంగా కొనసాగుతోందని సాగర్ సింగ్ వివరించారు.

Updated Date - 2023-04-19T08:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising