ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train accident: అంతపెద్ద ఒడిశా రైలు ప్రమాదం నుంచి ఈ వ్యక్తి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు...

ABN, First Publish Date - 2023-06-07T16:56:33+05:30

ఒడిశా రైలు ప్రమాదం ఎంత విషాదం మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మందికి అంగవైకల్యం, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రాణాలతో బయటపడిన ప్యాసింజర్లకు ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఓ పీడకలగా ఇంకా వారి కళ్లముందే కదలాడుతూనే ఉంది. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఒడిశాకు చెందిన ఓ ప్రయాణికుడు అనుకోని సంఘటనతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని విషాదగాథ ఏంటో తెలుసుకుందాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident ) ఎంత విషాదం మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మందికి అంగవైకల్యం, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రాణాలతో బయటపడిన ప్యాసింజర్లకు ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఓ పీడకలగా ఇంకా వారి కళ్లముందే కదలాడుతూనే ఉంది. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో(Howrah Express) ప్రయాణించిన ఒడిశాకు చెందిన ఓ ప్రయాణికుడు అనుకోని సంఘటనతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అంతటి ఘోర ప్రమాదం నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు.. ప్రత్యక్ష సాక్షిఅయిన అతని విషాదగాథ ఏంటో తెలుసుకుందాం..

లక్ష్మణ్ బారిక్.. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లా బాసింగకు చెందిన నివాసి. చెన్నైలో సెక్యూరిటీ గార్డ్‌గా 20 యేళ్ల నుంచి పనిచేస్తున్నారు. బాలాసోర్ రైలు ప్రమాదం జరిగినప్పుడు హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. తరచుగా హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే లక్ష్మణ్.. ఆ రోజు ఆలస్యం బాలాసోర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. ట్రైన్ వెళ్లిపోతుందన్న తొందరలో ఏసీ బోగీలో ఎక్కాడు. అదే అతనికి పునర్జన్మనిచ్చింది.

రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదం మిగిల్చిన ఈ ఘోరరైలు ప్రమాదం తర్వాత లక్ష్మణ్ భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఒకవేళ గనక తాను జనరల్ బోగీలో ఎక్కి ఉంటే.. ఈ పాటికి తన అంత్యక్రియలు కూడా అయిపోయి ఉండేవని ఆందోళన చెందాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడని.. చెన్నైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ ఓ బిడ్డ పెళ్లి చేశానని తెలిపాడు. నేను చనిపోయి ఉంటే నా బిడ్డలు అనాథలు అయిపోయేవారని ఏడ్చాడు.

ఆలస్యంగా బాలాసోర్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన తాను.. జనరల్ బోగీకి బదులుగా ఏసీ బోగీలో ఎక్కానని లక్ష్మణ్ తెలిపారు. తర్వాత అదనంగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతలోనే ఓ పెద్ద శబ్ధం లక్ష్మణ్ వినిపించింది. ఒక్కసారిగా బోగీల ఓ పక్కకు ఒరిగినట్లు లక్ష్మణ్ గుర్తించాడు. టాయిటెల్ దగ్గర నిలబడిన లక్ష్మణ్ ఈ ప్రమాదంతో ఓ మూలకు కుదుపుతో విసిరివేయబడ్డాడు. ‘‘నాకు స్పష్టంగా గుర్తుంది.. ఓ భయంకరమైన శబ్ధంతో ట్రైన్ పట్టాలు మీదనుంచి పక్కకు తొలగి ఆగిపోయింది’’ అని ఒళ్లు గగుర్పొడిచే ఆ ఘోర ప్రమాదం గురించి లక్ష్మణ్ తెలిపాడు.

ప్రమాదంలో అతని పక్కటెముకలపై తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. ఏం జరిగిందో తెలియని అయోమయస్థితినుంచి తేరుకున్న లక్ష్మణ్.. బోగీ నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన అరుపులు, కేకలు వినపడ్డాయి. ఆ గందరగోళం మధ్య కొంతమంది స్థానికుల సాయంతో బారాముండా బస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో తన బట్టలు రక్తంతో తడిసిపోయాయని లక్ష్మణ్ చెప్పుకుంటూ భయంతో వణికిపోయాడు. తర్వాత రాత్రి 11.30 గంటలకు భువనేశ్వర్ చేరుకొని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు.

బాలాసోర్ ఘోర రైలు ప్రమాదంలో లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ టెరిఫిక్ ట్రైన్ యాక్సిడెంట్‌ లక్ష్మణ్ బారిక్‌పై చెరగని ముద్ర వేసింది. చాలామంది ప్రాణాలను బలిగొంది. ‘‘ఇది నాకు పునర్జన్మ.. అత్యంత భయంకరమైన అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోలేను. నేను రైలు ఎక్కిన ప్రతిసారీ ఈ చేదు జ్ఒాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి’’ అని సెక్యూరిటీ గార్డ్ లక్ష్మణ్ బారిక్ తెలిపాడు.

Updated Date - 2023-06-07T17:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising