ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వందే భారత్ రైలును లాక్కెళ్తున్న పాత రైలింజన్.. కేంద్రంపై నెటిజన్ల సెటైర్లు.. రైల్వే శాఖ ఏం చెప్పిందంటే..

ABN, First Publish Date - 2023-07-02T16:33:43+05:30

హై-స్పీడ్ బుల్లెట్ రైళ్లు అంటూ కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలకే బాగా దెబ్బతినడం, ఎప్పటికప్పుడు పాడవుతుండడం మొదలైన కారణాలతో ప్రయాణికులు వందే భారత్ రైళ్లపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హై-స్పీడ్ బుల్లెట్ రైళ్లు అంటూ కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat Express) ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. చిన్న చిన్న ప్రమాదాలకే బాగా దెబ్బతినడం, ఎప్పటికప్పుడు పాడవుతుండడం, భారీ రేట్లు మొదలైన కారణాలతో ప్రయాణికులు వందే భారత్ రైళ్లపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ రైళ్లపై ప్రతిపక్షాలు కూడా తరచుగా విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దానిపై రైల్వే శాఖ (Indian Railway) వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వందే భారత్ రైలును పాతకాలం నాటి ఎలక్ట్రిక్ రైలు ఇంజన్ లాక్కెళ్తోంది (Old Electric Engine Pulls Vande Bharat). వందే భారత్ రైలు మొరాయించడంతో పాత రైలు ఇంజిన్‌‌తో తీసుకెళ్తున్నారని, ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్ల పరిస్థితి ఇదీ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ``తొమ్మిదేళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళ్తోంది`` అంటూ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ట్వీట్ చేశారు. బీజేపీ హై-స్పీడ్ రైలుకు పాతకాలం నాటి రైలింజనే దిక్కు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఒకరికి హాని చేయాలనుకుంటే మనమే నష్టపోతాం.. కావాలంటే ఈ వీడియో చూడండి..

ఈ వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ఆ వీడియోపై ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పందిస్తూ.. ``అది ఇంకా సర్వీస్ ప్రారంభించని వందే భారత్ రైలు`` అని వివరణ ఇచ్చింది. ఆ రైలుకు రూట్ ఇంకా ఖరారు కాలేదని, రూట్ ఖరారు అయిన తర్వాతనే లోకో పైలట్లు, సిబ్బంది అందుబాటులోకి వస్తారని క్లారిటీ ఇచ్చింది. కొత్తగా తయారైన ఆ రైలును చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి పాట్నా తరలిస్తున్నట్లు తెలిపింది.

Updated Date - 2023-07-02T16:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising