ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Old Woman: జిల్లా మేజిస్ట్రేట్‌ ఆఫీసులో 77 ఏళ్ల వృద్ధురాలు.. చేతిలో ఓ కాగితం.. దీనంగా అందరివైపూ చూపులు.. అసలేమైందని అడిగితే..!

ABN, First Publish Date - 2023-05-19T13:57:32+05:30

హాయిగా ఇంట్లో కూర్చోవాల్సిన 77ఏళ్ల బామ్మ పాపం కాళ్ళరిగేలా కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికెళ్ళింది. ఓ కాగితం చేతిలో పట్టుకుని దిగులుగా కూర్చొని ఉంటే అక్కడున్న వాళ్ల గుండెలు తరుక్కుపోయాయి. ఏమయ్యిందని బామ్మను కదిలిస్తే పాపం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీసు సందర్శకులతో కిటకిటలాడుతోంది. అక్కడికి వచ్చిన వారి మధ్యలో ఓ 77 ఏళ్ల వృద్దురాలు ధీనంగా కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఓ కాగితం రెపరెపలాడుతోంది. అలసిపోయిన ఛాయలు ఆ బామ్మ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.' ఏం కష్టమొచ్చిందో ఏమో' అని అక్కడున్నవారు ఆమెను చూసి విచారం వ్యక్తం చేశారు. ఏమయ్యిందని ఆ బామ్మను కదిలిస్తే ఓ కన్నీటి కథ బయటకొచ్చింది. హృదయాలను బరువెక్కించే ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్(Kanpur) జిల్లాలో కుసుమ్ సింగ్ అనే వృద్దురాలు ఉంది. ఆమె భర్త కోల్కతాలో(Kolkata) పనిచేసేవాడు. క్యాన్సర్ కారణంగా అతను 1981లో మరణించాడు. భర్త మరణం తరువాత కుసుమ్ సింగ్ కొడుకుతో కలసి ఉండేది. అయితే కొడుకు పెళ్లయ్యాక కోడలు కుసుమ్ సింగ్ ను సరిగా చూసుకోలేదు. కొడుకు కోడలు కనీసం భోజనం సరిగా పెట్టకపోవడంతో ఆమె కోల్కతా నుండి వారి స్వంత గ్రామానికి తిరిగి వచ్చేసింది. కానీ ఆమెకంటూ ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఆమె చాలా కష్టాలు పడుతోంది. తన భర్తకు వారి స్వగ్రామంలో అదనంగా కొంత భూమి(Land) ఉందని తెలుసుకుంది. దీంతో ఆ భూమిని తన పేరున రాయించుకుంటే ఆమెకు ఉపయోగకరంగా ఉంటందని భావించింది. అందుకోసం భోగ్నిపూర్ తహసీల్దార్ ఆఫీసుకు(Tehasildar office), రెవిన్యూ ఆఫీసుకు(revenue office) చాలా సార్లు తిరిగింది. వెళ్ళిన ప్రతిసారి వారు రేపురా.. ఎల్లుండిరా అంటూ ఆమెను తిప్పుతున్నారే కానీ ఆమె సమస్యను పరిష్కరించలేదు. దీంతో ఆమె విసిగిపోయింది. ఓ వినతిపత్రం రాయించుకుని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి(District Magistrate's office) చేరుకుని తన వంతు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. వృద్దురాలిని చూసి అక్కడున్నవాళ్లందరూ 'ఏమి కష్టమొచ్చిందో ఏంటో పాపం' అంటూ బాధపడ్డారు.

Viral News: ఈ టీ షాప్ ఓనర్ తెలివి మామూలుగా లేదుగా.. ఛాయ్ షాప్‌నకు అతడు పెట్టిన పేరుపై నెట్టింట హాట్ టాపిక్..!


బామ్మ అందరి మధ్యలో కూర్చుని వెయిట్ చేస్తుండగా అప్పుడే కార్యాలయంలోకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ అధికారి నేహా జైన్(District magistrate's office Neha jain) ఆ బామ్మను చూసింది. ఇంత పెద్దావిడ ఎందుకొచ్చింది అంటూ ఆ బామ్మ దగ్గరకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా విషయం అడిగింది. బామ్మ కన్నీళ్ళు పెడుతూ జరిగిందంతా చేప్పింది. నా భర్త స్థలాన్ని నాపేరున రాయించి పుణ్యం కట్టుకో తల్లీ అని చేతులెత్తి మొక్కింది. అంతా విన్న తరువాత మేజిస్ట్రేట్ నేహా చాలా భావోద్వేగానికి లోనైంది. ఏడుస్తూ బామ్మను కౌగిలించుకుని బామ్మకు ఓదార్చింది. ఆమె వెంటనే భోగ్నిపూర్ తహసీల్టార్, రెవిన్యూ ఆఫీసులకు ఫోన్ చేసి బామ్మ సమస్యను వీలైంత త్వరగా పరిష్కరించాని ఆదేశించింది. మేజిస్ట్రేట్ తక్షణ చర్యలకు బామ్మ ఎంతో సంతోషించింది.

Viral News: ఈ మహిళది కదా అదృష్టమంటే.. రూ.660 పెట్టి ఓ షాపులో కొని.. అసలు అదేంటో తెలిసి రూ.33 లక్షలకు మళ్లీ అమ్మేసింది..!


Updated Date - 2023-05-19T13:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising