ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: బామ్మా.. నీ ధైర్యానికి సలామ్.. 85 ఏళ్ల వయసులో.. క్రూర మృగాలు తిరిగే అడవిలో.. మూడు రోజుల పాటు ఒంటరిగా..!

ABN, First Publish Date - 2023-11-09T12:58:43+05:30

Viral News: కర్నాటకలోని శివమొగ్గలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 85 ఏళ్ల వృద్ధురాలు క్రూర మృగాలు తిరిగే అడవిలో రెండు రాత్రులు, మూడు రోజుల పాటు ఒంటరిగా ఉండిపోయింది. భారీ వర్షానికి తోడు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా కూడా ఆమె ఆ మూడు రోజులు అడవిలోనే ఉండి, ప్రాణాలతో బయటపడడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు.

Viral News: కర్నాటకలోని శివమొగ్గలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 85 ఏళ్ల వృద్ధురాలు క్రూర మృగాలు తిరిగే అడవిలో రెండు రాత్రులు, మూడు రోజుల పాటు ఒంటరిగా ఉండిపోయింది. భారీ వర్షానికి తోడు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా కూడా ఆమె ఆ మూడు రోజులు అడవిలోనే ఉండి, ప్రాణాలతో బయటపడడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. ఇంటి సమీపంలోని పొలాలకు వెళ్లిన ఆమె అక్కడ కనిపించిన పశువులను తరిమికొట్టే క్రమంలో పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. దాంతో ఇంటికి తిరిగి వచ్చే దారి మరిచిపోయింది. మూడు రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత బామ్మ ఆచూకీ దొరికింది.

Wife: బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భార్యకు చెప్పి.. సీక్రెట్‌గా ఇంటికి తిరిగొచ్చిన భర్త.. తెల్లారేసరికి ఊరంతా ఉలిక్కిపడే ఘటన..

అసలేం జరిగిందంటే..

కర్నాటక రాష్ట్రం శివమొగ్గలోని హోసానగర్ తాలూకా పరిధిలోని సద్గాల్ గ్రామంలో శారదమ్మ, చెన్నప్ప గౌడ అనే వృద్ధ దంపతులు వారి కుమారుడు జయాషీలా వద్ద ఉంటున్నారు. వారి పొలాలు ఇంటి సమీపంలోనే ఉంటాయి. ఈ క్రమంలో గత ఆదివారం (5వ తేదీన) పొలాలలో పశువులు పడ్డాయని చెప్పడంతో శారదమ్మ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లింది. పొలాల్లో పశువులను చూసిన ఆమె వాటిని తరిమి కొడుతూ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. అలా ఆమెకు తెలియకుండానే వాటి వెంబడి చాలా దూరం వెళ్లడంతో తిరిగి బయటికి వచ్చే దారి మరిచిపోయింది. దీనికి తోడు అప్పుడే భారీ వర్షం మొదలవడంతో ఆమె ఆ అడవి నుంచి బయటకు రాలేకపోయింది. ఇక సాయంత్రమైన శారదమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూశారు. కానీ, అక్కడ ఆమె కనిపించలేదు. చాలా సేపటివరకు చుట్టుపక్కల కూడా వెతికారు. కానీ, ఎక్కడ ఆమె జాడ కనిపించలేదు. రాత్రి కావడంతో వారు తిరిగి ఇంటికి వచ్చేశారు.

Shocking: విమానంలో కలకలం.. గాఢనిద్రలో ఉన్న 32 ఏళ్ల తెలుగు మహిళ.. ఏదో తగులుతున్నట్టు అనిపించి.. కళ్లు తెరిచి చూస్తే..!


ఆ తర్వాతి రోజు ఊరిలో వారితో కలిసి అడవి ప్రాంతానికి వెళ్లి జల్లెడ పట్టారు. అయినా శారదమ్మ దొరకలేదు. ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఊరి ప్రజలతో కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో అటవీ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టారు. అలా 3 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత బుధవారం శారదమ్మ జాడ కనుగొన్నారు. అడవిలో ఆమె వర్షంలో తడస్తూ, చీమలు కరిచి నడవలేని స్థితిలో ఉన్నారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం శారదమ్మ కొలుకున్నారు. ఆ తర్వాత అసలేం జరిగిందనేది కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇక మూడు రోజులు గడిచిపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందనుకున్నారు ఊరి వాళ్లు. కానీ, అదృష్టవశాత్తు శారదమ్మ బతికి రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Wife: నెలల తరబడి ఇంటికి రాని భర్త.. ఒకరికి ముగ్గురిని పెళ్లి చేసుకున్న భార్య.. ఆమె నిర్వాకం అసలెలా బయటపడిందంటే..!

Updated Date - 2023-11-09T12:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising