ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Petrol Price: అర్ధరాత్రి దేశ పౌరులకు సడన్ షాకిచ్చిన పాకిస్తాన్.. ఇప్పుడా దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-08-16T15:05:45+05:30

గత కొన్ని నెలలుగా దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో అల్లాడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. తినడానికి తిండి లేక ఎంతో మంది ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది.

గత కొన్ని నెలలుగా దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) తీవ్ర ఆర్థిక సమస్యలతో (Financial Problems) అల్లాడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. తినడానికి తిండి లేక ఎంతో మంది ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం జరిగిన మర్నాడే దేశ ప్రజలకు పాక్ ప్రభుత్వం స్వీట్ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది (Petrol Prices hike in pakistan). ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో (Pak Inflation)అల్లాడుతున్న ప్రజలు పెట్రోల్ ధరల పెంపుతో మరింత అల్లాడనున్నారు.

మంగళవార అర్ధరాత్రి నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ.17.50, లీటర్ డీజిల్‌పై రూ.20 పెంచనున్నట్టు పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.290.45కు చేరుకుంది. అలాగే లీటర్ ధర రూ.293.40కు చేరింది. కాగా, గత పదిహేను రోజుల్లో పాక్‌లో పెట్రోల్ ధర ఏకంగా రూ.40 పెరగడం గమనార్హం. ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై తాజా చర్య మరింత భారం మోపనుంది.

Viral: కూతురి బర్త్‌డే సెలబ్రేట్ చేయాలంటే లక్షలే ఉండనక్కర్లేదు.. ఆ పేద ఆటోడ్రైవర్ చేసిన పని ఐయేఎస్‌ను ఆకట్టుకుంది..

అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు (Petrol Price) పెరగడం వల్లే దేశంలో కూడా పెంచుతున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ నెల 1వ తేదీన షెహబాజ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.20 పెంచింది. మరో పదిహేను రోజుల్లోనే తాత్కాలిక ప్రభుత్వం రూ.17.50 పెంచింది. డీజిల్‌ కూడా కేవలం పదిహేను రోజుల్లో రూ.40 వరకు పెరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగిపోతాయని పాక్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-08-16T15:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising