ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistani Girl, indian Boy: లూడో గేమ్ సాక్షిగా.. అక్రమంగా ఇండియాలో ల్యాండ్ అయిన ప్రేయసి..!

ABN, First Publish Date - 2023-02-25T11:28:03+05:30

ఆ యువతి నిత్యం నమాజ్ చేస్తుండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది.

Pakistani girl Indian boy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ అమ్మాయి అతని కోసం పాకిస్తాన్ బోర్డర్ దాటి వచ్చింది., అతను కూడా పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాడు. హద్దుల్ని చేరిపేసిన ప్రేమ వాళ్లది. ఇద్దరినీ ఒకటి చేసింది. ఇంతకీ వీళ్ళు ఒకిరికి ఒకరు ఎక్కడ పరిచయం అయ్యారో తెలుసా..! లూడో గేమ్ ఆడుతూ ఉండగా ఒకరితో ఒకరికి పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు, ప్రేమకు హద్దులు లేవు, ఎల్లలు లేవు అన్నమాటను నిజం చేస్తూ ఆమె అతని ప్రేమకోసం బోర్డర్ దాటి వచ్చేసింది. అదీ అక్రమంగా అడ్డదారిలో వీసాలేకుండా హైదరాబాద్ చేరుకుంది.

ప్రేమ చాలా విచిత్రమైనది. ప్రేమ కోసం.. ఎంతటి సాహసానికైనా వెనుకాడరు ప్రేమికులు. అవసరమైతే ఎంతకైనా తెగిస్తారు కూడా. ఇంతటి ధైర్యాన్ని నింపగలిగేది ప్రేమ మాత్రమే. స్వచ్ఛమైన ప్రేమకు హద్దుల్ని చెరిపేసి, ఓ ప్రేమికురాలు దేశం కానీ దేశానికి అబ్బాయి వెతుక్కుంటూ అడ్డదారిలో వచ్చిపడింది. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం.. ముందు వెనుక ఆలోచించకుండా.. సరిహద్దులు దాటి వచ్చేసింది. ఈ ప్రేమ కథలో ప్రేమికుడిది భారత్ కాగా.. అమ్మాయిది పాకిస్థాన్. ఈ అపర ప్రేమికురాలు తన ప్రేమను గెలిపించుకోవడం కోసం.. వీసా లేకుండానే పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేసింది. ఆ యువకుడిని పెళ్లాడి, ఏది ఏమైనా అతడితోనే ఉండిపోయాలని ప్రయత్నించింది. కానీ.. అధికారులు ఆమెను తిప్పిపంపించారు.

ఇఖ్రా జీవానీ ఓ పాకిస్థానీ అమ్మాయి. ఆమె వయసు 19 ఏళ్లు. ఆమె ఆన్ లైన్‌లో లూడో గేమ్ ఆడుతుండగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇరవై ఆరేళ్ళ ములాయం సింగ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. తరుచు ఆన్లైన్‌లో కలుసుకుని ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నారు. స్నేహితులైయ్యారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. కేవలం కొద్దిరోజుల్లోనే ములాయం, ఇఖ్రాలు పీకల లోతు ప్రేమలో పడ్డారు.

ఏదిఏమైనా సరే.. ఎలాగైనా తన ప్రియుడితో జీవించాలనుకున్న ఆ యువతి.. వీసా లేకపోవడంతో.. ప్రియుడు ములాయం సలహాపై పాకిస్తాన్ నుండి దుబాయ్‌కి విమానంలో ప్రయాణమైంది. ఇక్రా తన ఇంట్లో ఉంచిన ఆభరణాలను అమ్మేసింది. ఆ తరువాత ఎలాగోలా.. ఆమె దుబాయ్ నుండి నేపాల్‌కు చేరుకుంది. ఇక్రా, ములాయం సింగ్‌లు ఖాట్మండులో వివాహం చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ఉన్నారు కూడా.

వాస్తవానికి ములాయం తనని సమీర్ అన్సారీ అనీ, తానో ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్ అని పరిచయం చేసుకున్నాడు. కానీ అతని అసలు పేరు ములాయం సింగ్ అని, అతను సెక్యూరిటీ గార్డు అని యువతికి తరువాత తెలిసింది. అంత అయినా తరువాత చేసిందేమి లేకపోవడంతో అతడితో ఉండిపోవాలని అనుకుంది. ఈ క్రమంలో వారు నేపాల్ మీదుగా భారతదేశానికి చేరుకున్నారు. బెంగళూరులో జీవనం సాగిస్తున్నారు.

ఇఖ్రా తన పేరును రవా అని మార్చుకుంది. అయితే.. ఆ యువతి నిత్యం నమాజ్ చేస్తుండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. అలాగే.. యాదవ్ ఆమె కోసం నకిలీ ఆధార్ కార్డును తయారు చేయించాడు. తరువాత భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేశాడు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో పోలీసులు ములాయం, ఇఖ్రాలను అరెస్ట్ చేశారు. ఇఖ్రా పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఆ పాకిస్థానీ అమ్మాయిని పంజాబ్‌లోని అమృత్ సర్‍‌కు తరలించారు. అట్టారీ బోర్డర్ నుంచి ఆమెను పాక్‌కు తిప్పి పంపారు. ఏమో ఈసారి ములాయం తన భార్యకోసం సక్రమంగానే బోర్డర్ దాటి వెళతాడేమో చెప్పలేం. కాకపోతే ప్రేమకు హద్దులు లేవని నిరూపించిన ఈ జంట కలవాలని మాత్రం కోరుకుందాం.

Updated Date - 2023-02-25T11:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising