ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railway: ఏం తెలివి గురూ.. కిక్కిరిసిపోయిన రైలు.. కూర్చోడానికి సీటు కూడా లేని చోట ఏకంగా పడుకునేందుకు వెరైటీ ప్లాన్..!

ABN, First Publish Date - 2023-09-25T19:03:47+05:30

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది రైల్వే ద్వారా ప్రయాణాలు సాగిస్తారు. చాలా రైళ్లలో సాధారణ భోగీలు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయే ఉంటాయి. అలాంటి భోగీల్లోకి ఎక్కడమే కష్టం. ఇక, సీటు దొరకడం అనేది దాదాపు అసాధ్యం.

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే (Indian Railway) ఒకటి. ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది రైల్వే ద్వారా ప్రయాణాలు సాగిస్తారు. చాలా రైళ్లలో సాధారణ భోగీలు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయే ఉంటాయి. అలాంటి భోగీల్లోకి ఎక్కడమే కష్టం. ఇక, సీటు (Seat in Train) దొరకడం అనేది దాదాపు అసాధ్యం. అయితే కొందరు తమ తెలివితేటలు ఉపయోగించి ఎలాగోలా కూర్చోవడానికో, పడుక్కోవడానికో ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో (Jugaad Video) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

hathim_ismayil అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రైల్వే భోగీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కనీసం నిల్చోవడానికి కూడా చోటు లేదు. అలాంటి భోగీలో ఓ వ్యక్తి తన తెలివితేటలు ఉపయోగించి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రెండు అప్పర్ బెర్త్‌లకు ఓ బెడ్ షీట్‌ (Bed Sheet)ను గట్టిగా కట్టి దాని మీద రెండు కాళ్లు చాచి మరీ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Adipurush: వందల కోట్ల రూపాయల ఆదిపురుష్ కంటే.. ఇదే బెస్ట్ అంటూ నెట్టింట కామెంట్స్.. ఈ వీడియోను చూస్తే..!

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 68 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎంతో మంది ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``అంత కిక్కిరిసిన భోగీలో ఇలా నిద్రపోవాలంటే చాలా తెలివి ఉండాలి``, ``ఐడియా బాగుంది.. కానీ, ఇలా నిద్రపోవడం చాలా ప్రమాదకరం``, ``బెడ్ షీట్ చిరిగిందంటే అతడికి, కింద ఉన్న వ్యక్తికి కూడా చాలా ప్రమాదకరం``, ``ఆ బెడ్‌షీట్‌పై అతడికి చాలా నమ్మకం ఉంది``, ``నేను కూడా ఇలా ట్రై చేస్తా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-25T19:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising