Fight in Train: అప్పర్ బెర్త్ కోసం ఇద్దరు కుర్రాళ్ల మధ్య బిగ్ ఫైట్.. అదిరిపోయే కామెంటరీతో పండుగ చేసుకున్న ప్రయాణీకులు..!
ABN, First Publish Date - 2023-10-16T18:47:31+05:30
మన దేశంలోని ప్రభుత్వ వాహనాలైన రైళ్లు, బస్సులు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా రైళ్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇక జనరల్ భోగీల గురించైతే చెప్పనక్కర్లేదు. భోగీలో సీట్ల కోసం జనాలు ఒకర్నొకరు కొట్టుకోవడం, తోసుకోవడం సర్వ సాధారణం.
మన దేశంలోని ప్రభుత్వ వాహనాలైన రైళ్లు (Trains), బస్సులు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా రైళ్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇక జనరల్ భోగీల గురించైతే చెప్పనక్కర్లేదు. భోగీలో సీట్ల కోసం జనాలు ఒకర్నొకరు కొట్టుకోవడం, తోసుకోవడం సర్వ సాధారణం. అలాంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. బీహార్ (Bihar)లో ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
@Bihar_se_hai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ట్రైన్ జనరల్ భోగీలోని అప్పర్ బెర్త్ కోసం గొడవ మొదలైంది (Fight for upper berth). అక్కడ కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ల దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. ముందు మామూలుగా నవ్వుతూనే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఓ కుర్రాడితో ఆ వ్యక్తి గొడవకు దిగాడు. ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. వారిద్దరూ కింద పడిపోతారేమోనని మిగతా ప్రయాణికులు భయపడ్డారు. తోటి ప్రయాణికుడు వారి ఫైటింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫైటింగ్ సమయంలో తోటి వారి మాటలు నవ్వు పుట్టిస్తున్నాయి.
Starbucks: సడన్‌గా ఉద్యోగంలోంచి తొలగించారని కోపం.. స్టార్‌బక్స్ కంపెనీకి కలలో కూడా ఊహించని షాకిచ్చిన మహిళ..!
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 85 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇలాంటి పనికిమాలిన వీడియోలను పోస్ట్ చేయవద్దు సోదరా``, ``ఇలాంటి వారి వల్ల బీహార్ పరువు పోతోంది``, ``జనరల్ భోగీల్లో ఇలాంటి గొడవలు సాధారణమే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-16T18:47:31+05:30 IST