ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: అమెరికాలో అబ్బాయి క్రేజ్‌కి బాబాయ్ అభినందనలు

ABN, First Publish Date - 2023-02-25T22:28:05+05:30

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అమెరికా (USA)లో అడుగుపెట్టిన క్షణం నుంచి.. అన్ని మీడియాలలో ఆయన గురించే వార్తలు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాకు సంబంధించిన

Pawan Kalyan and Ram Charan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అమెరికా (USA)లో అడుగుపెట్టిన క్షణం నుంచి.. అన్ని మీడియాలలో ఆయన గురించే వార్తలు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాకు సంబంధించిన అవార్డులు, అలాగే రామ్ చరణ్ పర్సనల్ ఇంటర్వ్యూలు.. వంటి వాటితో పాటు.. ఇప్పటి వరకు ఇండియన్‌కి దక్కని గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు. హాలీవుడ్ (Hollywood) సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ (Ram Charan) రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ఘనత సాధించిన రామ్ చరణ్‌కు.. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ కొల్లగొడుతున్న అవార్డుల నిమిత్తం దర్శకుడు రాజమౌళి (SS Rajamouli)కి జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభినందనలు తెలిపారు. తాజాగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు.

అందులో.. ‘‘ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డులలో ‘ఆర్.ఆర్.ఆర్’ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ అవార్డ్‌ను రామ్ చరణ్ ప్రకటించడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్‌కీ, దర్శకులు రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్‌ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక అబ్బాయ్‌కి బాబాయ్ అభినందనలు తెలపడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా వారిద్దరి గురించే మాట్లాడుకుంటుండటం విశేషం. ‘అబ్బాయ్‌కి బాబాయ్ అభినందలు’ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి సందడి చేస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల వేడుకలో ఈ ఆర్ఆర్ఆర్ చిత్రం ‘బెస్ట్‌ యాక్షన్‌ (Best Action), బెస్ట్‌ స్టంట్స్‌ (Best Stunts), బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (Best Original Song), బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ (Best International Film)తో పాటు స్పాట్‌ లైట్‌ అవార్డు (Spotlight Award)ను దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

************************************************

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-25T22:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising