లోకంలో అన్ని పక్షులు ఉండగా, ఉత్తరాలను పంపేందుకు పావురాలనే ఎందుకు వినియోగించారు?... వాటికున్న ప్రత్యేకత ఇదేనని తెలిస్తే...
ABN, First Publish Date - 2023-04-01T08:06:12+05:30
పురాతన కాలంలో ఉత్తరాలను(Letters) పంపేందుకు పావురాన్ని మాత్రమే ఎందుకు ఎంపిక చేశారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి పావురానికి ఒక ప్రత్యేక గుణం ఉంది.
పురాతన కాలంలో ఉత్తరాలను(Letters) పంపేందుకు పావురాన్ని మాత్రమే ఎందుకు ఎంపిక చేశారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి పావురానికి ఒక ప్రత్యేక గుణం ఉంది. పావురం(pigeon) ప్రయాణ మార్గాన్ని బాగా గుర్తుంచుకుంటుంది. ఈ మార్గాన్ని ఎప్పటికీ మరచిపోదు. ఇదే దీనివెనుక గల శాస్త్రీయ కారణం. పావురం శరీరంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ(system) ఉంటుంది. ఇది GPS మాదిరిగా పనిచేస్తుంది.
ఈ GPS వ్యవస్థ ఉన్నందునే పావురం ఎప్పుడూ తన దారిని మరచిపోదు. అలాగే అది కొత్త మార్గాన్ని(new way) కనుగొనడానికి మాగ్రెటోరిసెప్షన్ నైపుణ్యాన్ని ఉపయోగిస్తుంది. BBC నివేదిక ప్రకారం పలువురు పరిశోధకులు పావురం శరీరంలో 53 రకాల ప్రత్యేక కణాల సమూహం(group of cells) ఉందని, ఇది పావురం దిశను గుర్తించడంలో సహాయపడుతుందని తెలిపారు. మనుషుల మాదిరిగానే పావురాలు కూడా దృష్టి ద్వారా దిశలను(directions) సులభంగా గుర్తిస్తాయి. పావురం కళ్ల రెటీనా(Retina)లో ఒక ప్రత్యేక తరహా ప్రొటీన్(protein) ఉండటం వల్లనే ఇలా జరుగుతుంది. ఈ కారణంగానే పురాతన కాలం(Ancient times)లో సందేశాలు లేదా ఉత్తరాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారు.
Updated Date - 2023-04-01T08:23:49+05:30 IST