Personality Test: మీ చేతి బొటనవేలిని ఇలా పెడుతున్నారా.. అయితే మీరు ఎలాంటి వారో ఈజీగా తెలుసుకోవచ్చు..
ABN, Publish Date - Dec 21 , 2023 | 03:33 PM
అరచేతిలోని రేఖల ఆధారంగా కొందరు మనిషి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును చెప్పేస్తుంటారు. అలాగే చేతి వేళ్లపై గీతల ఆధారంగా కూడా జాతకాన్ని అంచనా వేస్తుంటారు. ఇది ఎంతవరకూ నిజమో, ఎంత వరకూ అబద్ధమో తెలీదు గానీ.. ఎక్కువ శాతం ...
అరచేతిలోని రేఖల ఆధారంగా కొందరు మనిషి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును చెప్పేస్తుంటారు. అలాగే చేతి వేళ్లపై గీతల ఆధారంగా కూడా జాతకాన్ని అంచనా వేస్తుంటారు. ఇది ఎంతవరకూ నిజమో, ఎంత వరకూ అబద్ధమో తెలీదు గానీ.. ఎక్కువ శాతం ఇలాంటి జాతకాలను నమ్ముతుంటారు. ఇప్పుడిదంగా ఎందుకు చెప్తున్నామంటే.. సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చేతి బొటన వేలి ఆధారంగా కూడా మనిషి వ్యక్తి్త్వాన్ని అంచనా వేయొచ్చట. రెండు చేతులు పట్టుకున్న సందర్భాల్లో బొటన వేలు ఉన్న స్థితిని బట్టి.. సదరు వ్యక్తిని అంచనా వేశారు. ఇంతకీ దీని వెనుక కథేంటో తెలుసుకుందాం..
చేతి వేళ్లలో బొటన వేలి ఆధారంగా వ్యక్తి మనస్థత్వాన్ని అంచనా వేయొచ్చని మనస్థత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో రెండు చేతులు కలిపి పట్టుకున్నట్లుగా ఉంది. అయితే అందులో ఓ వైపు ఎడమ చేతి బొటన వేలుపై కుడి చేతి బొటన వేలు ఉంది. అటు పక్కన కుడి చేతి బొటన వేలిపై ఎడమ చేతి బొటన వేలు ఉంది. అయితే బొటన వేలు ఉన్న ఆధారంగా వేర్వేరు మనస్థత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
ఫై ఫొటోలో చూపినట్లుగా ఎడమ చేతి బొటనవేలిపై కుడి చేతి బొటన వేలు పెట్టుకున్నారు. ఇలా అలవాటు ఉన్న వారి వ్యక్తిత్వం విలక్షణంగా ఉంటుందట. నాయకత్వ లక్షణాలతో పాటూ ఇతరులకు సాయం చేసే గుణం ఉంటందట. నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి జాగ్రత్తగా పరిశీలించి, ఎంతో అవగాహనతో ఆలోచిస్తారట. అదేవిధంగా లాభ, నష్టాలను ముందే అంచనా వేస్తారట. అలాగే మరోవైపు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారట.
ఇక ఈ ఫొటోలో ఉన్నట్లుగా కుడి చేతి బొటన వేలిపై ఎడమ చేతి బొటన వేలు ఉంటే.. ఇలాంటి వారు చాలా అరుదైన వ్యక్తులుగా పరిగణించబడతారట. ఇలాంటి వారు ఎలాంటి భావేద్వేగాలనైనా అందరితో పంచుకుంటుంటారు. వీరు ఎంతో దయ కలిగిన హృదయం కలిగి ఉంటారు. ఇతరలకు సాయం చేసేందుకు వెనుకాడరట. మీ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తుంటారు. అవతలి వ్యక్తులను చూడగానే.. వాని భావోద్వేగాలను, సమస్యలను అర్థం చేసుకుంటారట. ముఖ్యంగా సమస్యల్లో ఉన్న వారికి ఓ కౌన్సిలర్‌గా సాయపడతారట.
శరీరంలో విటమిన్ B12 తక్కువైతే.. ఎంత ప్రమాదమో తెలుసా..
Updated Date - Dec 21 , 2023 | 06:11 PM