వింత సంఘటన.. మూడు కళ్లతో పుట్టిన లేగదూడ.. చూసేందుకు తరలివస్తున్న జనం.. డాక్టర్లు ఏం తేల్చారంటే..
ABN, First Publish Date - 2023-01-03T19:06:36+05:30
మనుషులకైనా, జంతువులకైనా సాధారణంగా రెండే కళ్లు ఉంటాయి. అయితే కొన్నిసార్లు అరుదైన జననాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ దూడకు..
మనుషులకైనా, జంతువులకైనా సాధారణంగా రెండే కళ్లు ఉంటాయి. అయితే కొన్నిసార్లు అరుదైన జననాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ దూడకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఓ దూడ మూడు కళ్లతో పుట్టడంతో.. దాన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల వారు తరలి వస్తున్నారు. దీనిపై డాక్టర్లు ఏమంటున్నారంటే..
హర్యానాలోని (Haryana) రోహ్‌తక్ పరిధి ఖర్కడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోలు అనే వ్యక్తి కొన్ని ఆవులు (cows) పెంచుకుంటున్నాడు. కాగా, ఇటీవల ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా దూడకు మూడు కళ్లు (three eyes) ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. కుడి వైపు కంటిలో మరో కన్ను పుట్టుకొచ్చింది. ఈ వార్త స్థానికంగా వైరల్ అవడంతో చుట్టు పక్కల ప్రాంతాల వారు దూడను చూసేందుకు తరలివస్తున్నారు.
తాను కొంత కాలం క్రితం ఓ ఆవును కొనుగోలు చేశానని, డిసెంబర్ 27 ఆ ఆవు దూడకు జన్మనిచ్చిందని యజమాని తెలిపాడు. మూడు కళ్లతో దూడలు జన్మించడం ఎప్పుడూ జరగలేదని చెప్పాడు. కాగా, దీనిపై పశువైద్యులు మాట్లాడుతూ.. జననేంద్రియాల రుగ్మత వల్ల ఇలా జరుగుతుంటుందని చెప్పారు. ఇలాంటి సందర్భల్లో చాలా జంతువులకు అదనపు అవయవాలు ఏర్పడుతుంటాయన్నారు. లేగదూడ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, మూడు కళ్లతో పుట్టిన దూడ ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మందు పార్టీ చేసుకున్న మామా, అల్లుళ్లు.. నిద్రపోయి లేచిన మామ.. ఉన్నట్టుండి తన భార్య కనపడకపోవడంతో..
Updated Date - 2023-01-06T00:39:55+05:30 IST