Viral: చదువే.. తలరాతను మార్చేస్తుందని నిరూపించాడు.. 30 ఏళ్ల పాటు ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి.. ఇప్పుడే ఏ స్థాయిలో ఉన్నారంటే..!
ABN, First Publish Date - 2023-09-08T17:01:15+05:30
చదువుకునే రోజుల్లో కటిక దరిద్రం అనుభవించిన వాళ్లు.. ఎలాగైనా సమస్యల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో బాగా చదువుకుని చివరకు అనుకున్నది సాధిస్తుంటారు. తినడానికి తిండి లేని స్థానం నుంచి ఎందరో పేదలకు కడుపు నింపే స్థాయికి చేరుకుంటుంటారు. కొందరు...
చదువుకునే రోజుల్లో కటిక దరిద్రం అనుభవించిన వాళ్లు.. ఎలాగైనా సమస్యల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో బాగా చదువుకుని చివరకు అనుకున్నది సాధిస్తుంటారు. తినడానికి తిండి లేని స్థానం నుంచి ఎందరో పేదలకు కడుపు నింపే స్థాయికి చేరుకుంటుంటారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇలాంటి వితేతలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన వ్యక్తికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చదువే.. తలరాతను మార్చేస్తుందని నిరూపించాడు. 30 ఏళ్ల పాటు రేకుల షెడ్డులో ఉన్న ఆయన.. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారంటే..
నాగాలాండ్ ముంఖ్యమంత్రి (Chief Minister of Nagaland) నీఫియు రియో ఓఎస్డీ (OSD) నెల్లయప్పన్ తాజాగా ఓ పోస్టు షేర్ చేశారు. 30 ఏళ్ల కిందట తన జీవితానికి, ప్రస్తుతం ఉన్న స్థాయికి తేడా వివరిస్తూ రెండు ఫొటోలను షేర్ చేశాడు. తన చిన్నతనంలో నలుగురు తోబుట్టువులతో కలిసి చిన్న రేకుల ఇంట్లో ఎండేవాడినని చెప్పారు. సుమారు 30ఏళ్ల పాటు అదే ఇంట్లో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగంలో (Govt job) స్థిరపడాలన్న కోరికతో కష్టపడి చదివాడు.
చివరకు అనుకున్నది సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఓ పెద్ద బంగ్లాలో ఉంటున్నారు. చదువు, అంకితభావం, శ్రమతోనే ఈ స్థాయికి వచ్చినట్లు నెల్లయప్పన్ పేర్కొన్నారు. ఆయన పోస్టు చేసిన ఫొటోలు (Viral photos) సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘మీ జీవితం అందరికీ ఆదర్శం కావాలి’’.. అని కొందరు, ‘‘నిజంగా మీరు చాలా గ్రేట్ సార్’’.. అని ఇంకొందరు, ‘‘చదువు అంటే నిర్లక్ష్యం చేసే వాళ్లు ఈ గురించి తప్పకుండా తెలుసుకోవాలి’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-09-08T17:01:15+05:30 IST