ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పోలీసాయన కర్కశత్వం.. ప్లాట్‌ఫామ్ మీద పడుకున్న చిన్న పిల్లాడిపై దౌర్జన్యం.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-07-17T20:01:57+05:30

సామాన్య పౌరుల రక్షణ కోసం పని చేసే పోలీసుల్లో కొందరు ఉద్యోగులు హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచుగా చూస్తేనే ఉన్నాం. తాజాగా ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓ చిన్న పిల్లాడితో కర్కశంగా వ్యవహరించాడు. ప్లాట్‌ఫామ్ మీద పడుక్కున్న పిల్లాడిని కాలితో తన శాడిజం చూపించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామాన్య పౌరుల రక్షణ కోసం పని చేసే పోలీసుల్లో (Police) కొందరు ఉద్యోగులు హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు తరచుగా చూస్తేనే ఉన్నాం. తాజాగా ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (RPF Conistable) ఓ చిన్న పిల్లాడితో కర్కశంగా వ్యవహరించాడు. ప్లాట్‌ఫామ్ మీద పడుక్కున్న పిల్లాడిని కాలితో తన శాడిజం చూపించాడు (Policeman Brutally Kicks Child). రైల్వే ప్రయాణికుడు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆర్పీఎఫ్ విభాగం స్పందించి విచారణకు ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై (Railway Platform) నిద్రిస్తున్న చిన్నారిని చూసిన పోలీసు కానిస్టేబుల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఒంటరిగా ఉన్న ఆ పిల్లాడితో ఆ కానిస్టేబుల్ కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రిస్తున్న పిల్లాడిని కాలితో తన్నాడు. చుట్టూ ఉన్న వారు కూడా ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను ఆపే ప్రయత్నం చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో (Viral Video)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. శాడిస్ట్‌లా ప్రవర్తించిన ఆ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

Youtuber: బాబోయ్.. ఇంత డబ్బా..? ఈ యూట్యూబర్ ఇంట్లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు వెళ్తే ఏం దొరికాయంటే..!

లక్ష మందికి పైగా వీక్షించిన ఆ వీడియో బాగా వైరల్ అయి ఆర్పీఎఫ్ అధికారులకు చేరింది. వారు వెంటనే ఆ ఘటనపై స్పందించారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ వీడియోలో ఉన్న కానిస్టేబుల్‌ను గుర్తించి వెంటనే సస్పెండ్ చేశారు. సమగ్ర విచారణ చేసి నేరం రుజువైతే శిక్ష విధిస్తామని తెలిపారు.

Updated Date - 2023-07-17T20:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising