ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్ ఘటన.. ఒకే సిటీలో వేరు వేరు చోట్ల ముగ్గురు బిచ్చగాళ్లు మృతి.. పోస్ట్‌మార్టం రిపోర్టులో మాత్రం ఒకే కారణం..!

ABN, First Publish Date - 2023-01-12T18:19:00+05:30

పొట్టకూటి కోసం విధిలేని పరిస్థితుల్లో వారంతా బిచ్చగాళ్లుగా మారారు. పగలంతా భిక్షాటన చేయడం.. రాత్రి ఏ చెట్టు నీడనో, ఏ ఫుట్‌పాత్ మీదో పడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే సిటీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొట్టకూటి కోసం విధిలేని పరిస్థితుల్లో వారంతా బిచ్చగాళ్లుగా మారారు. పగలంతా భిక్షాటన చేయడం.. రాత్రి ఏ చెట్టు నీడనో, ఏ ఫుట్‌పాత్ మీదో పడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే సిటీలో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటున్న ముగ్గురు బిచ్చగాళ్లు మృతి చెందారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో మాత్రం ముగ్గురి మృతికీ ఒకే కారణమని తెలిసింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆమెకు నలుగురు పిల్లలు.. అతడికి ఇద్దరు సంతానం.. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఆత్మహత్య.. మొబైల్‌లో ఉన్న వీడియోలో..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఉజ్జయినిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నార్సింగ్ ఘాట్ ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటున్న ముగ్గురు బిచ్చగాళ్లు (beggars) అనుకోని పరిస్థితుల్లో వేర్వేరు ప్రాంతాల్లో సడన్‌గా మృతి (died) చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రక్తం గడ్డకట్టడం (blood clots) వల్లే వారంతా మృతి చెందారని పోస్టుమార్టం నివేదికలో (postmortem report) వెళ్లడైంది. కాగా, మధ్యప్రదేశ్‌లో ఇటీవల చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. నార్సింగ్‌పూర్, సియోని, ధార్, ఇండోర్, ఖాండ్వా, ఖర్గోన్, రాజ్‌గఢ్‌లలో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నాయి.

పాపం.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు.. నిండు గర్భిణి అయిన భార్యను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి..

ఉత్తరభారత దేశంలో వాతావరణంలో సడన్‌గా మార్పులు చోటు చేసుకోవడం వల్ల చలి (cold) ప్రభావం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన చలి కారణంగా రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందని, ఆ ముగ్గురు బిచ్చగాళ్లు కూడా ఇదే కారణంతో మరణించారని తెలిపారు. వారికి కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకపోవడంతో రాత్రంతా నరకయాతన అనుభవించారు. చలి కారణంగా రక్తం గడ్డ కట్టడంతో గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. జనవరి 14నుంచి మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పగటిపూట పొగమంచు, రాత్రి చలిగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు చలిని తట్టుకునేలా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

వరుడు ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు అసలు విషయం చెప్పడంతో..

Updated Date - 2023-01-12T18:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising