ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ప్రాంక్ వీడియో చేద్దామనుకుంటే పరిస్థితి తారమారైంది.. రోడ్డు మీదే కొట్టుకున్న అమ్మాయి, అబ్బాయి.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-09-18T19:45:52+05:30

చాలా మంది యూట్యూబర్లు, బ్లాగర్లు పబ్లిక్ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తుంటారు. వాటిల్లో కొన్ని చాలా అద్భుతంగా ఉండి అందరినీ విపరీతంగా నవ్విస్తుంటాయి. మరికొన్ని చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా ఢిల్లీలో ప్రాంక్ వీడియో షూట్ చేసే క్రమంలో పెద్ద గొడవ జరిగింది.

చాలా మంది యూట్యూబర్లు, బ్లాగర్లు పబ్లిక్ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు (Prank Video) చేస్తుంటారు. వాటిల్లో కొన్ని చాలా అద్భుతంగా ఉండి అందరినీ విపరీతంగా నవ్విస్తుంటాయి. మరికొన్ని చిరాకు తెప్పిస్తుంటాయి. తాజాగా ఢిల్లీలో ప్రాంక్ వీడియో షూట్ చేసే క్రమంలో పెద్ద గొడవ జరిగింది. ఓ అమ్మాయి, అబ్బాయి అందరి ముందే ఒకరినొకరు కొట్టుకున్నారు. అదంతా ఫేక్ అని కొందరు అంటుంటే, మరికొందరు వారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది (Viral Video).

ఢిల్లీ (Delhi)లోని కన్నాట్ ప్లేస్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అమ్మాయి ఓ అబ్బాయితో గొడవ పడుతోంది. ఇద్దరూ తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఆ సమయంలో అబ్బాయిని అమ్మాయి చెంపదెబ్బ కొట్టింది. దాంతో గొడవ పెద్దదిగా మారింది. ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా అబ్బాయిపై అమ్మాయి చేయి చేసుకుంది. దాంతో అబ్బాయి కూడా ఆ అమ్మాయిని కొట్టాడు. దాంతో ఆమె ఫోన్ తీసి ఎవరికో కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించింది.

Viral Video: ఈ ఏనుగు ఎంత తెలివైందో చూడండి.. కాలికి ఫెన్సింగ్ గుచ్చుకుంటోందని ఎలాంటి ప్లాన్ వేసిందంటే..

ఆ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను ఇప్పటివరకు దాదాపు 7 లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఆ వీడియో పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారం జరిగింది``, ``కొంచెం డీసెంట్‌గా ప్రవర్తిస్తే బాగుండేది``, ``అదంతా ఫేక్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-18T19:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising