ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife: భర్తకు ఏమైనా అవుతుందేమోనని బెంగపెట్టుకుందేమో.. జైల్లోనే.. కట్టుకున్న వాడి కళ్ల ముందే.. ప్రాణాలు వదిలిన నిండు గర్భిణి..!

ABN, First Publish Date - 2023-06-07T16:22:58+05:30

ఆ మహిళ నిండు గర్భిణి.. కొన్ని రోజుల క్రితం ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.. అప్పట్నుంచి ఆమె బెంగపెట్టుకుంది.. నిరంతరం తన భర్త గురించే ఆలోచించేది.. స్టేషన్‌లో తన భర్తను పోలీసులు ఏమైనా చేస్తారేమోనని విలవిలలాడేది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ మహిళ నిండు గర్భిణి (Pregnant).. కొన్ని రోజుల క్రితం ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.. అప్పట్నుంచి ఆమె బెంగపెట్టుకుంది.. నిరంతరం తన భర్త గురించే ఆలోచించేది.. స్టేషన్‌లో తన భర్తను పోలీసులు ఏమైనా చేస్తారేమోనని విలవిలలాడేది.. స్టేషన్‌లో ఉన్న తన భర్తను కలిసేందుకు ఆమె మంగళవారం వెళ్లింది.. భర్తను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది.. అతడి ఎదురుగానే కుప్పకూలిపోయింది.. హాస్పిటల్‌కు తీసుకెళ్తే అప్పటికే చనిపోయినట్టు పోలీసులు ధ్రువీకరించారు (Pregnant wife died infront of husband).

బీహార్‌ (Bihar)లోని భాగల్‌పూర్‌కు చెందిన గోవింద్ కుమార్ అనే వ్యక్తిని ఓ భూమి వివాదం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే గోవింద్ భార్య పల్లవి నిండు గర్భిణి. జూన్ 27వ తేదీన ఆమె డెలివరీ డేట్. ఈ లోపు భర్త అరెస్ట్ కావడంతో పల్లవి కుంగిపోయింది. తన భర్తను కలవడానికి జైలుకు వెళ్లాలని పల్లవి పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ఆమె వినలేదు. దీంతో మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు పల్లవిని కారులో ఘోఘా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె తన భర్తను చూసింది.

Shocking: ఏం ధైర్యమయ్యా స్వామీ.. గొంతులో కత్తిని పొడిస్తే.. బైక్‌ను స్వయంగా నడుపుకుంటూ ఆస్పత్రికి వెళ్లాడు..!

ఆ తర్వాత ఒక్కసారిగా తల తిరగడంతో పల్లవి భర్త కళ్ల ముందే కుప్పకూలిపోయింది. బంధువులు వెంటనే పల్లవిని కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్ల నిర్ధారించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య గోవింద్‌ తన భార్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది.

Updated Date - 2023-06-07T16:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising