Viral Video: కదులుతున్న రైల్లో నుంచి పడిపోయిన మహిళ.. క్షణాల్లో..
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:02 AM
ఉత్తరప్రదేశ్ లో(Uttarpradesh) జరిగిన ఓ రైలు ప్రమాదఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియా(Socialmedia)లో వైరల్ గా మారాయి.
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో(Uttarpradesh) జరిగిన ఓ రైలు ప్రమాదఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియా(Socialmedia)లో వైరల్ గా మారాయి. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోండా రైల్వేస్టేషన్లో (Gonda Railway Station) బుధవారం ఓ మహిళ కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయింది.
రైలు, ప్లాట్ ఫాం మధ్య చిక్కుకుంది. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆమెను గమనించారు. అప్రమత్తమైన అతను బాధితురాలు ట్రైన్ కింద పడిపోకుండా చేయి పట్టుకుని ప్లాట్ ఫాంవైపునకు లాగారు. మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్ ధైర్య సాహసాలను ప్రజలు మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Updated Date - Dec 14 , 2023 | 11:02 AM