Rajasthan: రాజస్థాన్‌లో అతి చిన్న పోలింగ్ బూత్.. ఓటర్లెందరో తెలిస్తే షాక్ అవుతారు
ABN, First Publish Date - 2023-11-10T12:49:48+05:30
Polling Booth: రాజస్థాన్(Rajastan)లోని ఓ పోలింగ్ బూత్(Polling Booth) కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దాని విశేషమే ఆ ఊరుని వార్తల్లో నిలిచేలా చేసింది. ఇంతకీ ఏంటా విశేషం అనుకుంటున్నారా.. రాజస్థాన్ లోని అతి చిన్న పోలింగ్ బూత్ ఇదే.
జైపుర్: ఎలక్షన్లు అనగానే.. దాని చుట్టూ అల్లుకున్న చాలా విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఓటర్ లిస్టు, పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు, పోలింగ్ బూత్ లు, నేతల ప్రచారాలు ఇలా అన్ని ఆసక్తికరంగా ఉంటాయి. రాజస్థాన్(Rajastan)లోని ఓ పోలింగ్ బూత్(Polling Booth) కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దాని విశేషమే ఆ ఊరుని వార్తల్లో నిలిచేలా చేసింది. ఇంతకీ ఏంటా విశేషం అనుకుంటున్నారా.. రాజస్థాన్ లోని అతి చిన్న పోలింగ్ బూత్ ఇదే. ఇక్కడ ఓటర్ల సంఖ్య తెలిస్తే షాక్ అవుతారు.
కేవలం 35 మంది ఓటర్లే ఇక్కడ ఉన్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. భారత ఎన్నికల సంఘం (EC) ఇండో-పాక్ సరిహద్దులోని మారుమూల గ్రామంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. బార్మర్(Baarmar) జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో కేవలం 35 మంది నివసిస్తున్నారు. ఇలా చాలా ప్రత్యేకతలు ఈ బూత్ కి ఉన్నాయి. 35 మంది ఓటర్లలో 17 మంది మహిళలు కాగా, 18 మంది పురుషులు. బాద్మేర్ కా పార్ అని పిలిచే ఈ గ్రామం ప్రధానంగా ఓ సమస్యను ఎదుర్కొంటోంది.
ఇక్కడి ప్రజలు ఓటు వేయడానికి 20 కి.మీ.ల దూరంలో ఉన్న పోలింగ్ స్టేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి వరకు ప్రయాణం చేయడానికి కేవలం ఒంటెలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రవాణా వ్యవస్థ లేదు. దీంతో వృద్ధులు, మహిళలకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్య ఎదురయ్యేది. కానీ ఈసీ వారు ఉన్న ప్రదేశంలోనే ఓటు వేయడానికి అవకాశం కల్పించింది. ఓటు వేసేందుకు అదే గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఆ గ్రామవాసుల సమస్య తీరినట్టైంది.
తొలి సారి స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నామనే సంతోషం ఆ గ్రామస్థులలో ఉంది. త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 7న ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో ఓటింగ్ జరగ్గా, రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్ 5న ఆయా రాష్ట్రాల కౌంటింగ్ జరగనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 200 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. సీఎం అశోక్ గహ్లోత్, బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చారు.
Updated Date - 2023-11-10T13:00:09+05:30 IST