ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

rajinikanth comments on venkaiah naidu: వెంకయ్య నాయుడిపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-03-12T09:49:02+05:30

rajinikanth comments on venkaiah: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదంటూ తన అభిప్రాయాన్ని(opinion) నిర్మొహమాటంగా వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

rajinikanth comments on venkaiah naidu: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదంటూ తన అభిప్రాయాన్ని(opinion) నిర్మొహమాటంగా వెల్లడించారు. నటుడు రజినీకాంత్‌ శనివారం సెపియన్స్‌హెల్త్‌ ఫౌండేషన్‌( SapiensHealth Foundation) రజతోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిధి(chief guest)గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రజినీకాంత్‌ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడికి భారత ఉప రాష్ట్రపతి(President) పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్న వెంకయ్య నాయుడును రాజకీయాల(politics) నుంచి దూరం చేశారని ఆరోపించారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని, ఆయన మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగితే ఎంతో బాగుండేదని రజినీకాంత్ తన మనసులోని మాటను వెల్లడించారు.

ఈ నేపధ్యంలో సూపర్‌ స్టార్‌ రజినీ‌కాంత్ వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యత(priority) సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రజినీకాంత్‌ మంచి నటుడని, ఆయనను తానే రాజకీయాల్లోకి రావద్దని చెప్పానన్నారు. ఆరోగ్యంగా(Healthy) ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదని సలహా ఇచ్చానని కూడా తెలిపారు.

ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని, ఇందుకు అనేక మార్గాలున్నాయని వెంకయ్య తెలిపారు. అయితే రాజకీయాల్లోకి వచ్చేవారిని తాను నిరుత్సాహపరచడం(Disappointing) లేదని కూడా పేర్కొన్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని, అయితే క్రమశిక్షణ, నిజాయితీ(honesty), అంకితభావం, నిబద్ధత ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు.

Updated Date - 2023-03-12T09:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising